HONOR X9c 5G | స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు చాలా వరకు మిడ్ రేంజ్ సెగ్మెంట్లోనే ఫ్లాగ్ షిప్ లాంటి ఫీచర్లను అందిస్తున్నాయి. అందులో భాగంగానే హానర్ కూడా లేటెస్ట్గా ఓ నూతన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. హానర్ ఎక్స్9సి 5జి పేరిట లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.78 ఇంచుల 1.5కె డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది అమోలెడ్ డిస్ప్లే కాగా దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. అందులో నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఇక ఈ ఫోన్ డిస్ప్లేను సూర్యకాంతిలో సైతం స్పష్టంగా వీక్షించేలా ఏకంగా 4000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. మరో 8జీబీ వరకు ర్యామ్‌ను అదనంగా వర్చువల్‌గా పెంచుకోవచ్చు.
ఈ ఫోన్‌కు ముందు భాగంలో డిస్ప్లేకు స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. ఐపీ65ఎం డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. ఫోన్ వెనుక భాగంలో 108 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న ప్రైమరీ కెమెరాను ఏర్పాటు చేయగా 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ఇచ్చారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 6600 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి గాను 66 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 9.0 ఇందులో లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు.
యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. హానర్ ఎక్స్9సి 5జి స్మార్ట్ ఫోన్‌ను టైటానియం బ్లాక్, జేడ్ క్యాన్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియెంట్ ధర రూ.21,999గా ఉంది. జూలై 12వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌లో ప్రత్యేకంగా విక్రయించనున్నారు.
లాంచింగ్ కింద ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1250 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.750 బ్యాంకు డిస్కౌంట్‌ను ఇస్తారు. జూలై 14వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన కస్టమర్లు రూ.750 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. రూ.1099 చెల్లిస్తే అదనంగా మరో ఏడాది ఉచితంగా వారంటీ లభిస్తుంది. రూ.7500 విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సైతం అందిస్తున్నారు.