Honor X80 Pro Max |స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి భారీ బ్యాటరీ సామర్థ్యంతో హానర్ కంపెనీ సరికొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. Honor X80 Pro Max పేరుతో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్లో ఏకంగా 11,000mAh బ్యాటరీని అందించింది. హానర్ ఫోన్లలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద బ్యాటరీ కావడం గమనార్హం.
చైనా మార్కెట్లో ఈ మొబైల్ ప్రారంభ ధరను 1999 చైనీస్ యువాన్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.28వేలు. ఈ ధరలో 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2199 యువాన్లు (సుమారు రూ.31వేలు), 8జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2499 యువాన్లు (సుమారు రూ.35వేలు), 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2799 యువాన్లు (సుమారు రూ.39వేలు)గా నిర్ణయించారు.
ఈ హానర్ 80 ప్రో మ్యాక్స్ మొబైల్ విక్రయాలను జూన్ 26వ తేదీ నుంచి చైనాలో ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ లైట్నింగ్ రెడ్, మూన్లైట్ వైట్, మిస్టిక్ బ్లాక్, వైబ్రెంట్ ఆరెంజ్ రంగుల్లో అందుబాటులోకి రానుంది.
హానర్ X80 ప్రో మ్యాక్స్ మొబైల్లో 6.8 అంగుళాల 1.5K LTPS AMOLED డిస్ప్లేను అందించారు. 120Hz రీఫ్రెష్ రేట్ సపోర్టుతో పాటు 10 వేల నిట్స్‌పీక్ HDR బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనివల్ల ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపించనుంది. అలాగే IP68, IP69, IP69K రేటింగ్‌లతో వస్తుండటంతో దుమ్ము, నీటి తుంపరల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.
ఈ ఫోన్లో QUALCOMM Snapdragon 6 Gen 5 చిప్‌సెట్‌ను అమర్చారు. Adreno 812 GPU సపోర్ట్‌తో గేమింగ్, మల్టీటాస్కింగ్ పనితీరు మెరుగ్గా ఉండనుంది.
ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 10x డిజిటల్ జూమ్ సపోర్టు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్లో 4K వీడియోలనున 30fps వద్ద రికార్డు చేయవచ్చు.
ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ 11000mAh భారీ బ్యాటరీ. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు 27W రివర్స్ వైర్డ్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఇతర డివైజ్‌లను కూడా ఈ ఫోన్ ద్వారా చార్జ్ చేయవచ్చు. కనెక్టివిటీపరంగా ఇది 5జీ, 4G LTE, Wifi 6, Bluetooth 6.0, GPS, NavLC, Galileo, GLONASS, BeiDou వంటి కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లను ఇందులో అందిస్తున్నారు.