Honor X7C 5G | ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన 5జి ఫోన్లను రూపొందిస్తూ వినియోగదారులకు అందిస్తున్నాయి. వినియోగదారులు కూడా తక్కువ ధరలో ఉండే ఫోన్లను కొనుగోలు చేసేందుకే ఆసక్తిని చూపిస్తున్నారు. బడ్జెట్ సెజ్‌మెంట్‌లో ప్రస్తుతం ఫోన్ల తయారీ ఎక్కువైంది. ఇక ఇదే కోవలో హానర్ కూడా ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. హానర్ ఎక్స్7సి 5జి పేరిట ఓ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్‌లో హానర్ విడుదల చేసిన లేటెస్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందించడంతోపాటు ధర కూడా తక్కువగానే ఉంది. ఈ ఫోన్లో 6.8 ఇంచుల టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది.
ఇక ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను అమర్చారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు ట్రిపుల్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అందువల్ల నీళ్లలో పడినా ఏమీ కాదు. డస్ట్, డ్రాప్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఐపీ 64 రేటింగ్ ప్రొటెక్షన్ ఫీచర్ లభిస్తుంది. ఇంత బడ్జెట్ ధరలో ఈ ప్రొటెక్షన్ కలిగిన ఫోన్ ఇదే కావడం విశేషం. అలాగే 5200 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేశారు. 35 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌ను వేసుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో అమర్చారు. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను సైతం ఇందులో అందిస్తున్నారు.
హానర్ ఎక్స్7సి 5జి స్మార్ట్ ఫోన్‌ను ఫారెస్ట్ గ్రీన్, మూన్ లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. ఆగస్టు 22వ తేదీ వరకు మాత్రమే ఈ ధర అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్‌పై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను ఆగస్టు 20 నుంచి అమెజాన్‌లో విక్రయించనున్నారు.