బ్లడ్‌లో హై ఒమెగా-3 ఫ్యాట్‌తో నో కొవిడ్ రిస్క్

న్యూఢిల్లీ: రక్తంలో అధికంగా ఒమెగా-3 ఫ్యాట్ ఆసిడ్స్ ఉంటే కరోనా వైరస్ ఇన్ఫెక్షనతో మరణం ముప్పు తక్కువ అని ఓ నూతన అధ్యయనం తేల్చింది. ఒమెగా ఫ్యాట్ ఆసిడ్స్ ఎక్కువగా ఉన్న వారితో పోలిస్తే ఒమెగా-3 ఇండెక్స్ (ఓ3ఐ) తక్కువగా ఉన్న వారిలో కొవిడ్-19తో నాలుగు రెట్లు ఎక్కువ ప్రాణానికి ముప్పు పొంచి ఉందని తేలింది. కరోనా వైరస్ సృష్టించే సైటోకైన్లు పెరుగకుండా డీహెచ్ఏ, ఈపీఏ వంటి ఒమెగా ఫ్యాట్ ఆసిడ్స్ నిరోధిస్తాయి.
మెరైన్ ఫ్యాటీ యాసిడ్స్‌లోని పౌష్టికాహారంలో ఈపీఏ, డీహెచ్ఏ ఉంటాయని ఇవి కరోనా రోగులకు ముప్పుని తగ్గించివేస్తాయని ప్రోస్టాగ్లాండిన్స్ ల్యూకోట్రైన్స్ అండ్ ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం తెలిపింది.ఈ మేరకు అమెరికాలోని శామ్యూల్ ఒస్చిన్ కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చేరిన 100 మంది రోగుల బ్లడ్ శాంపిళ్లను నిల్వ చేశామని ఈ అధ్యయనం రచయిత ఆరాష్ అషేర్ చెప్పారు. ఈపీఏ, డీహెచ్ఏ ఫ్యాటీ యాసిడ్స్‌లో బహుముఖ రూపాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఎక్కువగా ఉంటుంది.
ఒమెగా-3 ప్యాటీ యాసిడ్స్ పొందాలంటే మూడు పూర్తి ఆకృట్లు (515మి గ్రాములు), ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్‌సీడ్ (515మి గ్రాములు), ఒక టేబుల్ స్పూన్ పాంప్కిన్ సీడ్స్ (650 మిగ్రా), ఒక టాప్ షియా సీడ్స్ (700 మిగ్రాం), ఒక టేబుల్ స్పూర్ హెంప్ సీడ్స్ (800 మిగ్రా), ఒక కప్ ఎడమేమ్ (1000 మిగ్రా) తీసుకుంటే సరిపోతుంది. చేపల్లో డీహెచ్ఏ, ఈపీఏ ఉంటాయి. చేపలు, మాంసం తినేవారిలో కంటే శాఖాహార ప్రియుల్లోనే ఒమెగా ప్యాటీ ఆసిడ్స్ ఎక్కువ. ఒమెగా-3 ప్యాట్ ఆసిడ్స్ల్లో మెదడు ఆరోగ్యాన్ని డోకోసాహెక్సానోయిక్ యాసిడ్ (డీహెచ్ఏ) కాపాడితే, ఐకోసాపెంటానోయిక్ యాసిడ్ (ఈపీఏ).. శరీరంలో మంటను తగ్గిస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.