వాషింగ్టన్: మానవ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టాన్ని ఇప్పటికే నాసా ఆవిష్కరించింది. తొలిసారి భూమిపై కాకుండా సౌర కుటుంబంలోని మరో గ్రహంపై హెలికాప్టర్ ఎగిరింది. పర్సీవరెన్స్ రోవర్‌తోపాటు మార్స్‌పైకి వెళ్లిన ఇన్‌జెన్యూయిటీ హెలికాప్టర్ ఇప్పుడు స్వేచ్ఛగా మార్స్‌పై అటూ ఇటూ తిరుగుతోంది. అంతేకాదు ఆ హెలికాప్టర్ సౌండ్‌ను కూడా రోవర్ తొలిసారి క్యాప్చర్ చేసి భూమిపైకి పంపించింది. ఆ సమయంలో అది రోవర్‌కు 80 మీటర్ల దూరంలో ఉంది. అంత దూరం నుంచి సౌండ్‌ను రికార్డు చేయగలదో లేదో అని సైంటిస్టులు భావించినా.. పర్సీవరెన్స్లోని మైక్ ఆ పని చేసి చూపించింది.
ఈ అద్భుతమైన 3 నిమిషాల ఆడియో, వీడియోను నాసా శుక్రవారం రిలీజ్ చేసింది. ఏప్రిల్ 30వ తేదీన నాలుగోసారి విజయవంతంగా మార్స్‌పై ఎగిరిన హెలికాప్టర్ వీడియో ఇది. జెజెరో క్రేటర్‌లో ఈ అధ్బుతం ఆవిష్కృతమైంది. నిమిషానికి 2400 సార్లు హెలికాప్టర్ బ్లేడ్లు తిరిగాయి. మొత్తం 262 మీటర్ల దూరం ఇది ప్రయాణించి మళ్లీ కిందికి దిగింది. అది రోవర్ నుంచి దూరంగా వెళ్లినప్పుడు సౌండ్ తగ్గడం, దగ్గరగా రాగానే పెరగడం వీడియోలో గమనించవచ్చు. మార్స్ వాతావరణం మన భూవాతావరణ సాంద్రతలో కేవలం ఒక శాతం మాత్రమే ఉంటుంది. దీంతో అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.
🔊🔴 New sounds from Mars: Our @NASAPersevere rover caught the beats coming from our Ingenuity #MarsHelicopter! This marks the first time a spacecraft on another planet has recorded the sounds of a separate spacecraft.
— NASA (@NASA) May 7, 2021
🎧🚁 Turn the volume up: https://t.co/o7zG6mQJzx pic.twitter.com/s8Hm3dhcgg