వాషింగ్టన్: ఓ భారీ ఆస్టరాయిడ్ భూమి వైపు మెరుపు వేగంతో దూసుకొస్తోంది. ఇది ఈ నెల 24న భూమిని దాటి వెళ్లిపోనున్నట్లు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా వెల్లడించింది. ఈ ఆస్టరాయిడ్‌ను 2008 గో20గా పిలుస్తున్నారు. ఇది ఓ స్టేడియం పరిమాణం లేదా తాజ్‌మహల్ కంటే మూడు రెట్లు పెద్దగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. గంటలకు 18 వేల మైళ్ల వేగంతో అంటే సెకను 8 కిలోమీటర్ల వేగంతో ఇది భూమి వైపు దూసుకొస్తున్నట్లు నాసా చెప్పింది. ఈ స్పీడు కారణంగా ఆస్టరాయిడ్కు అడ్డుగా వచ్చే ఏదైనా ధ్వంసమైపోతుందని స్పేస్ ఏజెన్సీ తెలిపింది.
ఈ ఆస్టరాయిడ్ వ్యాసం 220 మీటర్లుగా ఉంది. ఇది భూమికి 28 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. అంటే ఇది భూమి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం కంటే ఎనిమిది రెట్లు. అయితే ఈ ఆస్టరాయిడ్ సురక్షితంగా భూమిని దాటి వెళ్లిపోతుందని నాసా తెలిపింది. అయితే ఈ ఆస్టరాయిడ్ కక్ష్యను అపోలోగా వర్గీకరించారు. ఈ కేటగిరీ ఆస్టరాయిడ్లు చాలా ప్రమాదకరం. దీంతో ఈ ఆస్టరాయిడ్ కదలికలను నాసా చాలా జాగ్రత్తగా గమనిస్తోంది.