అనవసరమైన సాఫ్ట్‌వేర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల లాప్‌టాప్‌పై లోడ్ పెరుగుతుంది. పైగా అవి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుండటం వల్ల ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతుంటుంది. కాబట్టి అనవసరమైన సాఫ్ట్‌వేర్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అరుదుగా ఉపయోగించే యాప్స్‌ను కూడా డిసేబుల్ చేసుకోవాలి.
లాప్‌టాప్‌లు వాడేవాళ్లు తరచూ ఛార్జింగ్ సమస్య ఎదుర్కొంటుంటారు. ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా సరే కొద్దిసేపు యూజ్ చేయగానే బ్యాటరీ ఖాళీ అయిపోతుంటుంది. దానికి మనం రెగ్యులర్‌గా చేసే పొరపాట్లు కారణం కావచ్చు. వాటిని సరిచేసుకుని కొన్ని టిప్స్ పాటిస్తే బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు. ఆ ట్రిక్స్ ఏంటంటే..
కొంతమంది స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఎక్కువగా పెడుతుంటారు. దీనివల్ల ఛార్జింగ్ తొందరగా అయిపోతుంటుంది. కాబట్టి ఇంట్లో లేదా ఆఫీసులో ఉన్నప్పుడు బ్రైట్‌నెస్ తక్కువగా పెట్టుకోవాలి. ఓపెన్ డోర్‌లో ఉన్నప్పుడు మాత్రమే బ్రైట్‌నెస్ పెంచుకోవాలి.
ఎక్సటర్నల్ కీబోర్డ్, మౌస్, హార్డ్‌వేర్ డ్రైవ్స్, వెబ్ క్యామ్స్ వంటివి లాప్‌టాప్‌తో కనెక్ట్ చేసి వర్క్ చేసుకుంటారు. వీటి కోసం బ్యాటరీ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి వాటితో అవసరం అయిపోయిన వెంటనే రిమూవ్ చేసేయాలి.
చాలామంది లాప్‌టాప్‌ను బెడ్‌పై, సోఫాపై కూడా వాడుతుంటారు. అలాంటి సమయంలో లాప్‌టాప్‌కు గాలి తగలక వేడేక్కుతుంది. దీనివల్ల ల్యాప్‌టాప్‌ను నార్మల్ టెంపరేచర్ కోసం తీసుకొచ్చేందుకు ఫ్యాన్స్ ఎక్కువగా తిరుగుతాయి. దీనివల్ల బ్యాటరీపై ప్రభావం పడుతుంది. అందుకే లాప్‌టాప్‌ను కాస్త గాలి తగిలే ప్రదేశాల్లో ఉంచాలి లేదా కూలింగ్ ప్యాడ్స్ వాడాలి.
అవసరం ఉన్నా, లేకున్నా చాలామంది వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌ను ఆన్‌లోనే ఉంచేస్తుంటారు. దీనివల్ల కూడా ఛార్జింగ్ తొందరగా అయిపోతుంటుంది. కాబట్టి పని అయిపోగానే ఆ ఫీచర్స్‌ను ఆఫ్ చేయాలి.
కొంతమంది బ్యాటరీ పూర్తిగా అయిపోయే వరకు వాడతారు. మరికొందరు ఛార్జర్ కనెక్ట్ చేసి ఫుల్ ఛార్జింగ్ అయినా కూడా అలాగే ఉంచేస్తుంటారు. ఈ రెండూ బ్యాటరీ లైఫ్‌ను తగ్గించేస్తాయి. కాబట్టి కనీసం 20 శాతం ఉన్నప్పుడే లాప్‌టాప్‌కు చార్జింగ్ పెట్టాలి. 100 శాతం అయ్యే లోపే రిమూవ్ చేయాలి.