Flipkart GOAT Sale 2025 | ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్లో GOAT పేరిట ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ జూలై 12 నుంచి 17వ తేదీ వరకు కొనసాగుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా పలు స్మార్ట్ ఫోన్లు, ఆడియో ఉత్పత్తులు, యాక్ససరీలపై ఆకట్టుకునే రాయితీలను, ఆఫర్లను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా నథింగ్ ఫోన్ 3ని విక్రయిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న క్రోమా, విజయ్ సేల్స్, ఇతర ప్రధాన రిటెయిల్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. నథింగ్ ఫోన్ 3ఎ ప్రొను రూ.26,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే నథింగ్ ఫోన్ 3ఎ ను రూ.21,999 ధరకు కొనవచ్చు. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రొ స్మార్ట్ ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.16,999 ధరకు విక్రయిస్తున్నారు.
ఈ సేల్‌లో భాగంగా నథింగ్ ఇయర్ ఎ ఇయర్ బడ్స్‌ను రూ.5,999 ధరకు విక్రయిస్తున్నారు. అలాగే నథింగ్ ఇయర్ బ్లాక్ ఇయర్ బడ్స్‌ను రూ.8,999 ధరకు, నథింగ్ ఇయర్ స్టిక్ బడ్స్‌ను రూ.2,999 ధరకు అందిస్తున్నారు. సీఎం బడ్స్ ప్రొ ధర రూ.2,499గా ఉంది. సీఎంఎఫ్ బడ్స్ 2ఎ ధర రూ.1,999గా ఉంది. సీఎంఎఫ్ బడ్స్ ధర రూ.2,299 ఉండగా, సీఎంఎఫ్ నెక్‌బ్యాండ్ ప్రొ ధర రూ.1899గా ఉంది. సీఎంఎఫ్ బడ్స్ ప్రొ 2 ధర రూ.3,499గా ఉంది. సీఎంఎఫ్ వాచ్ ప్రొ ధర రూ.2,499 ఉండగా, సీఎంఎఫ్ వాచ్ ప్రొ 2 ధర రూ.4199గా ఉంది.
ఈ సేల్‌లో భాగంగా నథింగ్‌కు చెందిన యాక్ససరీలను కూడా తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. నథింగ్ పవర్ 65 వాట్ల చార్జర్ ధర రూ.2,499 ఉండగా, 33 వాట్ల చార్జర్‌ను రూ.999కు అందిస్తున్నారు. 45 వాట్ల చార్జర్ ధర రూ.2,299గా ఉంది. 100 వాట్ల చార్జర్‌ను రూ.2,999 ధరకు కొనవచ్చు. 140 వాట్ల చార్జర్ ధర రూ.3,999గా ఉంది. నథింగ్ కేబుల్ 1 మీటర్ ధర రూ.599 ఉండగా, నథింగ్ కేబుల్ 1.8 మీటర్స్ ధర రూ.799గా ఉంది.
ఇవేకాకుండా పలు ఇతర కంపెనీలకు చెందిన ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను, డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే క్యాష్‌బ్యాక్‌తోపాటు డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం అందిస్తున్నారు. తగ్గింపు ధరలు స్టాక్ ఉన్నంత వరకే అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలియజేసింది. కనుక బడ్జెట్ ధరలో ఫోన్లు లేదా యాక్ససరీలను కొనాలని చూస్తున్నవారు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.