ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ విద్యార్థుల కోసం స్పెషల్ సేల్ ప్రకటించింది. ‘బ్యాక్ టు కాలేజ్’ గ్యాడ్జెట్స్ కార్నివాల్ పేరుతో నిర్వహిస్తున్న సేల్ జూన్ 21 నుంచి ప్రారంభమైంది. మరో మూడు రోజుల పాటు కొనసాగనున్న సేల్ జూన్ 24న ముగుస్తుంది. ప్రత్యేక సేల్‌లో టాప్ బ్రాండ్లకు చెందిన గ్యాడ్జెట్లపై 80శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డులపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు అవసరమైన ఎలక్ట్రానిక్స్ వస్తువులపై తగ్గింపును ప్రకటించింది.
వెరిఫైడ్ స్టూడెంట్స్‌కు ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ రూ.750 తగ్గింపును కూడా అందిస్తోంది. బోట్, వన్‌ప్లస్, జేబీఎల్, రియల్మీ, ఫిలిప్స్ వంటి ఇతర ప్రముఖ బ్రాండ్లకు చెందిన బ్లూటూత్ హెడ్ఫోన్లపై 60 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. ఎంపిక చేసిన కంపెనీలకు చెందిన ఇయర్‌బడ్స్, హెడ్ఫోన్లపై 80శాతం డిస్కౌంట్ ఉంది. టాబ్లెట్లు, గేమింగ్ మానిటర్లపై 45శాతం తగ్గింపు ప్రకటించింది.
Learning will be easy & super fun with the latest collection of Laptops, Tablets & Accessories on Flipkart. Back to College Sale is Live Now!
— Flipkart (@Flipkart) June 21, 2021