న్యూఢిల్లీ : ప్రముఖ వాచ్ బ్రాండ్ ఫాస్ట్రాక్ భారత్‌లో న్యూ స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. అందుబాటు ధరలో స్టైలిష్ లుక్‌లో రిఫ్లెక్స్ బీట్+ను ప్రవేశపెట్టింది. గతంలో కంపెనీ లాంఛ్ చేసిన ఫిట్నెస్ బ్యాండ్ల కంటే విభిన్నంగా భారీ డిస్ప్లేతో రిఫ్లెక్స్ బీట్+ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
ఈ స్మార్ట్‌వాచ్ 1.69 ఇంచ్ అల్ట్రా వు డిస్ప్లేతో యువత మెచ్చే స్టైలిష్ లుక్‌తో కస్టమర్ల ముందుకు తీసుకువచ్చామని టైటాన్ సీఓఓ వేరబుల్స్ డిజిటల్ హెల్త్ ఇన్నోవేటర్ రవి కుప్పురాజ్ పేర్కొన్నారు. ఫాస్ట్రాక్ న్యూ స్మార్ట్‌వాచ్ రిఫ్లెక్స్ బీట్+ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో రూ . 1495కే లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ బీగ్ లాటె, వైన్ రెడ్, బ్లాక్, ఆలివ్ గ్రీన్, డీప్ టీల్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
ఈ వాచ్ 60 మల్టీ స్పోర్ట్స్ మోడ్స్‌లో హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, ఎస్పీఓ2 మానిటర్ వంటి హెల్త్ ఫీచర్లతో లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌తో అందుబాటులో ఉండటంతో అన్ని రకాల క్రీడాకారులు, అడ్వంచర్స్‌కు మేలైన ఎంపికగా ఉంటుంది.