ఫేస్బుక్.. ఎప్పుడైతే సోషల్ మీడియా నెట్‌వర్క్‌గా జనాల్లోకి వెళ్లిందో.. అప్పటి నుంచే సోషల్ మీడియా గురించి జనాలు తెలుసుకోవడం మొదలు పెట్టారు. ఫేస్బుక్ కంటే ముందు ఆర్కుట్ అనే ఓసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఉండేది కానీ.. అది అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఫేస్బుక్ ప్రారంభం అయ్యాక.. ఆర్కుట్ బంద్ అయిపోయింది. ఫేస్బుక్ లైమ్ లైట్లోకి వచ్చింది.
ఇప్పటికీ.. ఇండియాలో ఫేస్‌బుకే నెంబర్ వన్ సోషల్ మీడియా నెట్‌వర్క్‌గా కొనసాగుతూ వస్తోంది.
ఫేస్బుక్.. ప్రతి క్వార్టర్‌కు కొన్ని లెక్కలను బేరీజు వేసుకుంటుంది. ఆ మూడు నెలల కాలంలో.. ఫేస్బుక్లో యూజర్లు ఎంత మంది పెరిగారు, కంటెంట్ ఎంత ఉంది, ఉన్న కంటెంట్‌కు ఎన్ని వ్యూస్ వచ్చాయి. దేశాల వారీగా అత్యధిక వ్యూస్ వచ్చిన పోస్ట్ ఏది? లాంటి ఎన్నో రిపోర్టులను ఫేస్బుక్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. అయితే.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సెకండ్ క్వార్టర్లో యూఎస్‌లో అత్యధికంగా వ్యూస్ వచ్చిన పోస్ట్ ఏదో తెలుసా? మన ఇండియాలో పోస్ట్ అయినదే. ముంబైకి చెందిన Mumbai-based monk అనే ఫేస్బుక్ పేజీ పోస్ట్ చేసిన ఓ పోస్ట్‌ను యూఎస్‌లో అత్యధికంగా చూశారు.
ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముంది అంటే.. రాండమ్ ఆల్ఫాబెట్స్ ఉన్న ఫోటో అది. ఇది నిజమో కాదో నాకు తెలియదు. కానీ.. ఇది ఇంటరెస్టింగ్‌గా ఉంది. నేను చూసిన మొదటి మూడు పదాలు.. gratitude, connection and change. మరి మీరు చూసిన మొదటి మూడు పదాలు ఏంటో కామెంట్ చేయండి.. అనేదే ఈ పోస్ట్ సారాంశం. ఆ పోస్ట్‌కు యూఎస్‌లో 80.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 8 కోట్ల వ్యూస్ అన్నమాట.
ఇక.. అత్యధికంగా వ్యూస్ వచ్చిన రెండో పోస్ట్ ఏస్ గుత్తా.. అనే ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్‌కు వచ్చాయి. పైరెక్స్ మ్యూజిక్ గ్రూప్ సీఈవో పెట్టిన పోస్టుకు 61.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నా వయసు అయిపోయింది. కానీ.. నేను ఇప్పటికీ యంగ్‌గా కనిపిస్తున్నా.. అంటూ లుక్ యంగ్ చాలెంజ్‌కు సంబంధించిన పోస్ట్ అది. ఆ తర్వాత యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ గత ఏప్రిల్‌లో పెట్టిన పోస్ట్‌కు 52.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.