ChatGPT | స్వచ్ఛమైన ఇంగ్లిష్ భాష మీద పట్టు ఉంటే చాలు.. అటుపై కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే హాట్కేక్ల్లాంటి ఇంజినీరింగ్ జాబ్ రెడీగా ఉంది. ఆరంకెల డాలర్లలో శాలరీ కూడా అందుకోవచ్చు. మీ యాజమాన్య సంస్థ అవసరాలకు అనుగుణంగా చాట్‌జీపీటీ తరహా ఏఐ చాట్‌బోట్ తయారు చేయగలిగితే చాలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ పరిజ్ఞానం.. సాఫ్ట్వేర్ టూల్స్ గురించి తెలుసుకుంటే మస్త్.
ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు, జర్నలిస్టులు, కార్పొరేట్లు, సాఫ్ట్వేర్ సంస్థలు ఒక్కటేమిటి.. సమస్త ప్రజానీకానికి అవసరమైన సమాచారం కావాలంటే చాట్‌జీపీటీ తరహా ఏఐ చాట్బోట్లు ఫేమస్. ఏ అంశంలోనైనా సరైన సమాచారం తక్షణం ముందు తెచ్చి పెడతాయి ఈ చాట్బోట్లు. ఆ చాట్‌బోట్‌లకు అవసరమైన, సమగ్ర సమాచారం తెచ్చే పెట్టడంలో సరిగ్గా వ్యవహరిస్తే చాలు.. మిమ్మల్ని `ప్రాంఫ్ట్ ఇంజినీర్` అని పిలిచేస్తారు.
శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పని చేస్తున్న ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత స్టార్టప్ ఆంథ్రోపిక్ తాజాగా `ప్రాంఫ్ట్ ఇంజినీర్ అండ్ లైబ్రేరియన్` జాబ్‌కు అర్హులైన వారు కావాలని ఓ పోస్ట్ పెట్టింది. 3.35 లక్షల అమెరికన్ డాలర్ల వేతనం చెల్లించడానికి రెడీగా ఉంది. సామూహిక డేటా సెట్ల నుంచి సేకరించిన పరిజ్ఞానంతో టెక్ట్స్, ఇతర కంటెంట్ తయారు చేయడమే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్.. ఇవే నూతన తరహా ఇంటెలిజెన్స్ అంటున్నది ఆంథ్రోపిక్స్.