SpaceX | నెక్స్ట్ అంతరిక్ష ప్రయాణంలో ఫ్రీ వైఫై, వేడి వేడి ఆహారం: ఎలోన్ మస్క్
నెక్స్ట్ అంతరిక్ష ప్రయాణంలో ఫ్రీ వైఫై, వేడి వేడి ఆహారం | నలుగురు సాధారణ వ్యక్తులను స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన స్పేస్‌క్రాఫ్ట్ డ్రాగన్ క్యాప్సూల్
నలుగురు సాధారణ వ్యక్తులను స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన స్పేస్‌క్రాఫ్ట్ డ్రాగన్ క్యాప్సూల్ ఇటీవలే అంతరిక్షంలోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇన్సిపిరేషన్ 4 అనే మిషన్ పేరుతో ఈ అంతరిక్ష యాత్రను స్పేస్ఎక్స్ కంపెనీ లాంచ్ చేసింది. వీళ్లు అంతరిక్షంలో మూడు రోజులు గడిపి భూవాతావరణంలోకి విజయవంతంగా వచ్చేశారు. ఫ్లోరిడా తీరానికి దగ్గర్లో ఉన్న అట్లాంటిక్ వద్ద డ్రాగన్ క్యాప్సుల్ లాండ్ అయింది. దీంతో.. సాధారణ వ్యక్తుల అంతరిక్ష యాత్ర విజయవంతం అయింది.

ఇక.. అంతరిక్షంలోకి వెళ్లాక.. డ్రాగన్ క్యాప్సుల్‌లో ఉన్న ఆ నలుగురు వ్యక్తులకు తొలిసారి వడ్డించిన ఆహారం.. పిజ్జా. అయితే.. పిజ్జాను తినడం వాళ్లకు సర్కస్ ఫీట్లు చేసినట్టుగా అయిందట. గాల్లో ఎగురుతున్న పిజ్జాను నోట కరుచుకొని కొంచెం కష్టంగానే తినేశారట. అయితే.. పిజ్జా మాత్రం చాలా చల్లగా ఉందట. వావ్.. మేము నమ్మలేకపోతున్నాం. అంతరిక్షంలో చల్లని పిజ్జా తింటున్నాం. ఇన్సిపిరేషన్4 మిషన్‌లో ఉన్న సిబ్బందికి ఇచ్చే ఫుడ్ లిస్ట్ ఇదే అంటూ.. ఇన్సిపిరేషన్4 ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. సారీ.. పిజ్జా చల్లగా ఉంది కదా. నిజానికి డ్రాగన్‌లో ఫుడ్‌ను వేడి చేసుకునే ఫుడ్ వార్మర్ ఉంది. నెక్స్ట్ టైమ్ మిషన్‌లో వేడి వేడి ఫుడ్‌తో పాటు ఫ్రీ వైఫైని కూడా అందిస్తాం.. అని ఎలోన్ మస్క్ ఆ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చారు.

స్టార్‌లింక్ ద్వారా డ్రాగన్ క్యాప్సుల్‌లో ఇంటర్నెట్ ఫెసిలిటీని మస్క్ అందించనున్నారు. క్లౌడ్ లేవల్లోకి స్పేస్ క్రాఫ్ట్ వెళ్లగానే.. లేజర్ లింక్స్ లేదా కా పారాబోలిక్స్ను ఉపయోగించి.. డ్రాగన్‌ను ఇంకా పైకి పంపిస్తారు.

డ్రాగన్ క్యాప్సూల్‌లో వెళ్లి మూడు రోజులు అంతరిక్షంలో గడిపిన.. ఆ నలుగురు వ్యక్తులకు పిజ్జాతో పాటు శాండ్విచ్, వెజ్జీ ప్లాటర్, బాగెల్స్, మెడిటెర్రేనియన్ లాంబ్, పాస్తా, మీట్ బాల్స్, రోస్టెడ్ ఏదమమె, సలామీ, బకాన్, చెద్దర్, బీఫ్, టర్కీ జెర్కీ, టార్టిల్లాస్, టీ, కాఫీతో పాటు స్నాక్ ఐటెమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు.
Splashdown! Welcome back to planet Earth, @Inspiration4x! pic.twitter.com/94yLjMBqWt
— SpaceX (@SpaceX) September 18, 2021
Sorry it was cold! Dragon will have a food warmer & free wifi next time 🙂
— Elon Musk (@elonmusk) September 17, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Space X | చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్.. 3 రోజులపాటు నలుగురు సాధారణ వ్యక్తులు స్పేస్‌లోకి..
ఇవాళ ఆకాశంలో అద్భుతం.. ఆ మూడు ఖగోళ రాశులూ ఒకేచోట..
ISS | స్పేస్ స్టేషన్‌లోని ఆస్ట్రోనాట్లు రోజుకు ఎన్ని సూర్యోదయాలు చూస్తారో తెలుసా?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

