నేలపై సూర్యుడు!

- అయస్కాంత శక్తితో విద్యుదుత్పత్తి
- భారీ ప్రాజెక్టుకు 35 దేశాల సన్నాహం
- 1.47 లక్షల కోట్లతో అభివృద్ధి
న్యూయార్క్, సెప్టెంబర్ 17: భవిష్యత్ విద్యుత్తు డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి శాస్త్రవేత్తలు గత కొన్నేండ్లుగా పరిశోధనలను ముమ్మరం చేస్తూనే ఉన్నారు. శిలాజ ఇంధనం, న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుదుత్పత్తి సాధ్యమవుతున్నప్పటికీ పర్యావరణం పరంగా పలు దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. సౌర, పవన, జల వనరుల సాయంతో విద్యుదుత్పత్తి జరుగుతున్నా.. భవిష్యత్ డిమాండ్‌ను అది ఎంత మేరకు పూడ్చగలదన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో ప్రపంచంలోని దాదాపు 35 దేశాలు ఏకతాటిపైకి వచ్చి ‘నేలపైన సూర్యుడి’ని నిర్మించే పనిలో పడ్డాయి. దాని పేరే ‘ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పరమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్)’.
విమానాన్నే లాగేయగలదు
దక్షిణ ఫ్రాన్స్‌లో నిర్మించిన ఐటీఈఆర్లో పెద్ద అయస్కాంతం ఉంటుంది. 60 అడుగుల ఎత్తు, 14 అడుగుల వ్యాసంతో ఏకంగా ఒక విమానాన్ని సైతం సులభంగా ఆకర్షించగల ఈ అయస్కాంతం.. శక్తి ఉత్పన్నంలో కీలక పాత్ర పోషించనున్నది. విశ్వంలోని నక్షత్రాల్లో జరిగే ‘ఫ్యూజన్ మిమిక్’ ప్రక్రియను ఆధారంగా చేసుకొని రెండు హైడ్రోజన్ అణువులను దగ్గరగా చేర్చి బ్రహ్మాండమైన శక్తిని ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే 75% వరకు పూర్తైన ఈ రియాక్టర్‌ను 2026లో మండించనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.1.47 లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- artificial sun
- energy
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

