హాలీవుడ్ సినిమా ‘ఆర్మగెడాన్’ చూశారా? భూమివైపునకు దూసుకొస్తున్న గ్రహశకలంమీదకు వ్యోమగాములను పంపించి దాని ప్రయాణ దిశను మార్చి ప్రపంచాన్ని కాపాడటమే ఆ చిత్ర ఇతివృత్తం. సరిగ్గా నిజజీవితంలో కూడా నాసా ఇదే చేయబోతున్నది. గ్రహశకలాల నుంచి భూమికి భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదాలను తప్పించడానికి ‘డార్ట్ మిషన్’ను రూపొందించింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా భూమికి 1.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘డిడిమోస్’ గ్రహశకలానికి చెందిన ఉప శకలం గమన వేగాన్ని, దిశను ఉపగ్రహం సాయంతో మార్చనున్నారు. ఈ ప్రయోగంలో ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టమ్, ప్రత్యేక లేజర్ కిరణాలు కీలక పాత్ర పోషించనున్నాయి. వచ్చే నవంబర్లో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నారు. సెప్టెంబర్ 2022లో ‘డిడిమోస్’ను ఢీకొట్టనున్నారు.