న్యూఢిల్లీ : ఐఫోన్ 15 స్పెసిఫికేషన్స్‌పై స్పెక్యులేషన్స్ జోరుగా సాగుతుండగా ఏకంగా ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్ డిస్ప్లే వివరాలు బహిర్గతమయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ లాంఛ్ కానుండగా అప్‌కమింగ్ ఐఫోన్ల ఫీచర్లపై కీలక వివరాలు లీక్ కావడం టెక్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 2024 ఐఫోన్స్ స్క్రీన్ సైజులను మార్చాలని యాపిల్ యోచిస్తుండగా భారీ డిస్ప్లేలతో ఐఫోన్ 16 ప్రొ మోడల్స్ రానున్నాయని మ్యాక్రూమర్స్ వెల్లడించింది.
ఐఫోన్ 16 ప్రొ, మ్యాక్స్ మోడల్ వరుసగా 6.3 ఇంచ్, 6.9 ఇంచ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకొస్తాయని డిస్ప్లే సప్లయి చైన్ కన్సల్టెంట్స్ కౌ ఫౌండర్ రాస్ యంగ్ తెలిపారు. యాపిల్ తన పలు మోడల్స్‌లో ఉపయోగించిన ఓఎల్ఈడీ ప్యానెల్స్‌తో ఈ డిస్ప్లేలు ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. అయితే ఐఫోన్ 15 సిరీస్‌లో మాత్రం డిస్ప్లే మార్పులను యాపిల్ చేపట్టడం లేదు.
గత ఏడాది డివైజ్‌ల్లో చూసిన ప్యానెల్స్‌తోనే ఐఫోన్ 15 సిరీస్, 2023 యాపిల్ ఫోన్లు రానున్నాయి. ఇక ఐఫోన్ 16 సిరీస్ మిగతా వివరాలు ఇంకా వెల్లడికాలేదు. మరోవైపు ఐఫోన్ 15, ప్లస్ మోడల్ యాపిల్ బయోనిక్ ఏ16 చిప్‌సెట్‌ను కలిగిఉండగా, ప్రొ మోడల్స్ ఏ17 చిప్‌తో రానున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఐఫోన్ 15 సిరీస్‌లో అన్ని డివైజ్‌లు కంపెనీ న్యూ డైనమిక్ ఐలండ్ ఫీచర్‌తో కస్టమర్ల ముందుకు రానున్నాయి. న్యూ మోడల్స్‌లో యాపిల్ భారీ బ్యాటరీ యూనిట్‌ను ఆఫర్ చేయనుంది.
Read More