Giveaway Offers | బంపర్ ఆఫర్ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి
Giveaway Offers | సోషల్‌మీడియాలో సరదా పోస్ట్ చదువుతుంటాం! ఇంతలో ‘ఆలసించిన ఆశాభంగం’ అని సందేశాల పరంపర మొదలవుతుంది. అతి చౌకగా నిత్యావసరాలు అని ఓ పోస్ట్ పుట్టుకొస్తుంది.
Giveaway Offers | సోషల్‌మీడియాలో సరదా పోస్ట్ చదువుతుంటాం! ఇంతలో ‘ఆలసించిన ఆశాభంగం’ అని సందేశాల పరంపర మొదలవుతుంది. అతి చౌకగా నిత్యావసరాలు అని ఓ పోస్ట్ పుట్టుకొస్తుంది. ఇదేదో భలేగా ఉందే అనుకున్నంతలో.. ‘ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉచితంగా చూడాలనుకుంటున్నారా..?’ అని మరో పోస్టు, ఆ ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే.. ‘కారుచౌకగా డిజైనర్ దుస్తులు..’ ఇంకో ప్రకటన.. ఇలా వచ్చిపడుతుంటాయి. ఇవన్నీ సోషల్ మీడియా ఫేక్ ఇన్ఫ్లూయెన్సర్స్ సంధించే అస్త్రాలు. వాటిని చూసీచూడనట్లు వదిలేస్తే ఏ చిక్కూ ఉండదు! ప్రలోభాల మాయలో టచ్ చేస్తే ‘గివ్ అవే’ ట్రాపులో పడ్డట్టే!!
గివ్ అవే’ పోస్టుల్లో కొన్ని ఫిషింగ్ లాంటివే! సోషల్ మీడియా ఫేక్ ఇన్ఫ్లూయెన్సర్లు పన్నే వల ఇది. సామాజిక మాధ్యమాల్లో లైకులు కొల్లగొట్టడానికి, ఫాలో వర్స్ను పెంచుకోవడానికి ‘గివ్ అవే’ని బెస్ట్ వేగా ఎంచుకుంటున్నారు. ప్రొడక్ట్ బాగుందనో, ఆకర్షణీయమైన చిత్రం ఉందనో.. వీటి జోలికి వెళ్తే తర్వాత మనమీద జాలి పడాల్సిన పరిస్థితి దాపురించొచ్చు! అదెలాగంటే.. ‘గివ్ అవే’ పేజీని లైక్, సబ్‌స్ర్కైబ్ చేసిన వినియోగదారుడి వ్యక్తిగత సమాచారం గాల్లో దీపంగా మారిపోతుంది. అంటే, వారి ప్రొఫైల్ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉంది.
ఫేక్ గివ్ అవేలు ముందుగా ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఊరించే ఆఫర్లతో ఊదరగొడతారు. ‘స్పిన్ చేయండి.. విలువైన కానుకలు గెలుచుకోండి’ అనే పోస్టులు తరచూ ఫేస్బుక్, ఇన్‌స్టా వేదికలపై కనిపిస్తూ ఉంటాయి. ఈ స్పిన్ అండ్ విన్లో గతంలో గెలిచిన వారి అభిప్రాయాలు పక్కనే ఉంటాయి. ఇంకేం, నిజమే అనుకొని స్పిన్ చేసి, తీరా ఆకర్షణీయమైన బహుమతి గెలుచుకున్న తర్వాత.. ఈ పోస్ట్‌ను పదిమందికి షేర్ చేయమని మరో సందేశం వస్తుంది. అప్పనంగా బహుమతి వస్తుంది కదా! అని, దానిని మనవారికే ఫార్వర్డ్ చేసేస్తాం. కానీ, సదరు లింక్ ఓపెన్ చేయగానే మన సమాచారం వారి హస్తగతమయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ విషయం తెలియక లింక్‌ను ఒకరు పది మంది, ఆ పది మంది ఇంకో పదేసి మందికి ఇలా షేర్ చేస్తూపోతారు. ఇంతవరకూ ఫర్వాలేదు అనుకున్నా.. లక్షల మంది సమాచారం ఫేక్ గివ్ అవే నిర్వహిస్తున్న వారికి దొరికిపోతుంది.
ఇంకాస్త తెలివి మీరిన వాళ్లు ఎన్జీవో తరఫున క్విజ్ నిర్వహిస్తున్నామంటూ పోస్ట్ చేస్తారు. క్విజ్‌లో గెలుపొందిన వారికి రూ.5,000 బహుమానంగా ప్రకటిస్తారు. బడి పిల్లలు కూడా జవాబులు చెప్పగలిగే ప్రశ్నలు చూడగానే.. ఆ బహుమతి మనదే అనే భావన కలుగుతుంది. ముందువెనుక ఆలోచించకుండా పోటీలో పాల్గొంటారు. గెలుపొందుతారు. రూ.5,000 బహుమతి రావడం సంగతి అటుంచితే, ఈ ఆట పూర్తయ్యేలోపు మన వ్యక్తిగత సమాచారం కాస్తా లూటీ అవుతుంది. ఇది ఫేక్ అని తెలిసేంతలోనే లక్షలాది మంది సమాచారం ఫేక్ ఇన్ఫ్లూయెన్సర్ల చేతికి దొరుకుతుంది. ఇలా కొల్లగొట్టిన సమాచారాన్ని డార్క్ వెబ్ వాళ్లకు అమ్ముకుంటారు. కొన్ని సందర్భాల్లో వీటిలో మాల్వేర్ లింక్‌లు కూడా ఉండొచ్చు. దానిని క్లిక్ చేయగానే మన గోప్యత అంగట్లో సరుకు అవుతుంది. ఈ ఫేక్ గివ్ అవేల నుంచి తప్పించుకోవడం తేలికే! తెలివిగా వ్యవహరిస్తే వీటికి చిక్కకుండా ఉండొచ్చు.
ఇవి గమనించండి
☞చట్టబద్ధమైన గివ్ అవే సోషల్ మీడియా చానెళ్లు ఏవైనా పోటీలు నిర్వహించినప్పుడు, పోటీదారులకు కచ్చితమైన నిబంధనలు తెలియజేస్తాయి. ఏ నియమాలూ లేకపోతే తేడాగా గుర్తించవచ్చు.
☞ అఫీషియల్ బ్రాండ్లకు సంబంధించిన, సెలెబ్రిటీలకు చెందిన ఫేస్బుక్ పేజీలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ధ్రువీకరిస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే నకిలీ వాటిని గుర్తించడం కష్టమైన పనేం కాదు.
☞ గివ్ అవే పేజీ కొత్తగా ప్రారంభమైంది అయితే, తక్కువ కంటెంట్ కలిగి ఉండటంతోపాటు ప్రొఫైల్‌లో రెడ్ ఫ్లాగ్ కనిపిస్తుంది. అప్పటికీ ఏమైనా అనుమానాలు ఉంటే, ప్రొఫైల్ చెక్ చేసి నిజానిజాలు నిర్ధారించుకోవచ్చు. సదరు సంస్థకు చెందిన అఫీషియల్ వెబ్‌సైట్‌నూ చూడటం మంచిది!
☞నిజమైన వాటికి, ఫేక్ వాటికి స్వల్ప తేడా ఉంటుంది. పరిశీలిస్తే ఒరిజినల్ లోగోకు, ఫేక్ లోగోకు మధ్య తేడా కనిపెట్టొచ్చు. తేలికైన భాష వాడటం, వ్యాకరణ దోషాలు, సమాచార లోపం కనిపిస్తే వాటిని తప్పుడు గివ్ అవేలుగా గుర్తించాలి.
☞ సబ్‌స్ర్కైబ్ చేయమని, కామెంట్ చేయమని నిర్బంధం చేసినా, ఫాలో అవ్వమన్నా ఫేక్ అని అనుమానించవచ్చు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read More :
Fishing | అందమైన అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడుకుందాం రమ్మని లింకులు పంపిస్తున్నారా?
“Crypto Currency | అమ్మ బాబోయ్.. భారత్‌లో పన్నులమోత.. క్రిప్టోకు అనుకూలం కాదు..!”
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

