Team George | రాజు (పేరు మార్చాం) మెరిట్ స్టూడెంట్. ఇటీవలే డిగ్రీ పూర్తిచేసిన అతను సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దీంతో రాజు మెరిట్‌ను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. సివిల్స్ ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటుచేసింది. తన భవిష్యత్తుకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న అధికార పార్టీకి రాజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఫేస్బుక్లో పలు పోస్టులు పెట్టాడు. రెండ్రోజులు గడిచింది. అధికార పార్టీని పొగుడుతూ రాజు పెట్టిన కామెంట్లు.. పచ్చి బూతులుగా మారిపోయాయి. అవి వందలాది మందికి షేర్ కూడా అయ్యాయి. దీంతో ఏం జరిగిందో తెలియక.. రాజు అయోమయంలో పడ్డాడు.
ఎన్నికలు జరుగనున్న మరికొద్ది రోజుల్లో ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఎదురుకావొచ్చు. మీ అనుమతి లేకుండానే, మీకు తెలియకుండానే.. మీ ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్, టెలిగ్రామ్, లింక్డ్ఇన్ ఖాతాల్లోని పోస్టుల సారాంశం మారిపోవచ్చు. దీనికి కారణం.. ఇజ్రాయెల్ కాంట్రాక్టర్ల హ్యాకింగ్ ఏజెన్సీ ‘టీమ్ జార్జ్’. నెటిజన్ల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసి.. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ప్రసారం చేయడమే దీని విధి. ఈ మేరకు ప్రఖ్యాత వార్తా పత్రిక ‘ది గార్డియన్’ కథనాన్ని ప్రచురించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన ‘పెగాసస్’ స్పైవేర్ కంటే మరో పెద్ద హ్యాకింగ్ ఉదంతం తాజాగా బయటపడింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగాల్సిన ఎన్నికలను స్వార్థ ప్రయోజనాల కోసం.. ఏ విధంగా ప్రభావితం చేయవచ్చో, దాని కోసం సైబర్ హ్యాకింగ్‌ను ఎలా వాడుకోవచ్చో కొత్తగా వెలుగుచూసింది. ఫేక్ న్యూస్, అకౌంట్ హ్యాకింగ్ ద్వారా ఇప్పటికే 30కి పైగా దేశాల్లో జరిగిన ఎన్నికల్లో జోక్యం చేసుకొన్న ఇజ్రాయెల్‌కు చెందిన ‘టీమ్ జార్జ్’ అనే ఓ కాంట్రాక్టర్ల హ్యాకింగ్ ఏజెన్సీ.. భారత్‌లోనూ ఓ ప్రధాన పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధమైందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. వివిధ పార్టీలపై ప్రజలకు ఉన్న అభిప్రాయాలు ఏ మాత్రం పట్టించుకోకుండా.. తమకు డీల్‌ను అప్పగించిన పార్టీకి మాత్రమే అనుకూలంగా తప్పుడు వార్తలను ప్రచారం చేయడమే ఈ ఏజెన్సీ లక్ష్యంగా తెలుస్తున్నది. 33 దేశాల ఎన్నికల్లో ఈ టీమ్ ఇప్పటివరకూ జోక్యం చేసుకోగా.. అందులో 27 దేశాల్లో తాము డీల్ కుదుర్చుకున్న పార్టీనే పగ్గాలు చేపట్టిందంటే, ఈ టీమ్ సృష్టించే తప్పుడు ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రఖ్యాత బ్రిటన్ పత్రిక ‘ది గార్డియన్’ ఓ కథనాన్ని ప్రచురించింది. తమ రహస్య పరిశోధనకు భారతీయ జర్నలిస్టు గౌరీ లంకేశ్ స్ఫూర్తిగా గార్డియన్ పేర్కొనడం గమనార్హం.
సోషల్‌మీడియాలో, ఆన్లైన్ మాధ్యమాల్లో నిర్ణీత కాలంలో లెక్కకు మించి పోస్టులు, షేర్లు జరిగితే, అధికృత వెబ్ సోర్స్ ‘రోబో కాదని నిరూపించుకోండి’ అంటూ ఒక పాపప్‌ను చూపించి, కొన్ని చిత్రాలతో పరీక్ష చేయడం తెలిసిందే. అయితే, అధునాతన సెమీ-ఆటో అవతార్లతో కూడిన ఎయిమ్స్ సాఫ్ట్వేర్ ఇలాంటి సిస్టమ్ ప్రొటోకాల్‌ను కూడా సులభంగా బురిడీ కొట్టించగలదు.
ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్, లింక్డ్ఇన్, యూట్యూబ్, అమెజాన్‌తో పాటు క్రెడిట్ కార్డ్స్ డీటెయిల్స్, బిట్‌కాయిన్ వాలెట్స్కి సంబంధించిన కోట్లాది ఖాతాల వివరాలు ‘టీమ్ జార్జ్’ దగ్గర ఉన్నట్టు తెలుస్తున్నది. ఎయివ్ పాటు వెబ్సైట్లను సృష్టించే అధునాతన ‘బ్లాగర్ మెషీన్’ కూడా ‘టీమ్ జార్జ్’ దగ్గర ఉన్నది. ఈ వెబ్సైట్లలో సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఫేక్‌న్యూస్ వ్యాప్తి చేస్తారు.
వివిధ దేశాలకు చెందిన 30కి పైగా మీడియా సంస్థల జర్నలిస్టులతో కూడిన కన్సార్టియం ‘టీవ్ు జార్జ్’పై రహస్య పరిశోధన చేపట్టింది. ‘ఫర్బిడెన్ స్టోరీస్’ అనే ఫ్రాన్స్‌కు చెందిన నాన్-ప్రాఫిట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పరిశోధన చేపట్టారు. తమను తాము క్లయింట్లుగా పరిచయం చేసుకుని టీవ్ు జార్జ్ అధిపతి తాల్ హనన్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో రెండు దశాబ్దాలుగా ఈ హ్యాకింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నామని హనన్ జర్నలిస్టులతో స్వయంగా చెప్పారు. భారత్‌తో పాటు బ్రిటన్, అమెరికా, కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్, మెక్సికో, యూఏఈ సహా 20 దేశాల్లో పలు అంశాల్లో ‘టీమ్ జార్జ్’ జోక్యం చేసుకొన్నట్టు సమాచారం.
బీజేపీకి ఇజ్రాయెల్ ఏజెన్సీల సాయం: కాంగ్రెస్ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ఏజెన్సీల సాయం తీసుకుంటున్నారని, ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
‘టీమ్ జార్జ్’ అనేది ఓ కాంట్రాక్టర్ల హ్యాకింగ్ సంస్థ. ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేస్తున్నది. అత్యాధునిక హ్యాకింగ్ టెక్నిక్స్ దీని సొంతం. ఒకేసారి 30వేల ఆన్లైన్ అకౌంట్స్‌ను నియంత్రించగల బృందం ఈ ఏజెన్సీ దగ్గర ఉన్నది. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను సోషల్‌మీడియా ప్రచారం ద్వారా వ్యూహాత్మకంగా దెబ్బకొట్టడమే ‘టీమ్ జార్జ్’ విధి. దీనికోసం వివిధ రాజకీయ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకొంటుంది. ఇప్పటికే 33 దేశాల ఎన్నికలను ప్రభావితం చేసినట్టు ‘టీవ్ు జార్జ్’ అధిపతి హనన్ చెప్పారు.
తమతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారాన్ని కల్పించడమే లక్ష్యంగా ‘టీమ్ జార్జ్’ పనిచేస్తుంది. దీని కోసం అప్పటికే తమ దగ్గర ఉన్న డాటాబేస్‌లోని లక్షలాది సోషల్ అకౌంట్లను వాడుకొంటుంది. అలాగే, ఆన్లైన్లో లక్షలాది ఫేక్ ఎకౌంట్లను సృష్టిస్తుంది. అప్పటికే మనుగడలో ఉన్న నకిలీ అకౌంట్లను నియంత్రణలోకి తీసుకొంటుంది. అనంతరం ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. దీనికోసం..‘అడ్వాన్స్డ్ ఇంప్యాక్ట్ మీడియా సొల్యూషన్స్ (ఎయివ్ సాఫ్ట్‌వేర్‌ను వాడుతుంది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)