ఉద్యోగులు డల్ కావద్దంటే కంపెనీలు ఈ జాగ్రత్తలు తీసుకోవ్వాల్సిందే!
బాస్ చెప్పినపని అరగంటలో పూర్తిచేయాలి. అంతలోనే వాట్సాప్‌లో సందేశం. దానికి బదులిచ్చేలోపు.. ఇంకో యాప్‌లో మ్యాచ్ మొదలైందన్న నోటిఫికేషన్. పని కాస్తా పెండింగ్! బంతి బంతినీ లైవ్‌లో చూసే టెక్నాలజీ యుగంలో ఉండగా.. అడపాదడపా స్కోర్ చూసి సంతృప్తిపడేవాళ్లు ఎంతమంది ఉంటారు?
బాస్ చెప్పినపని అరగంటలో పూర్తిచేయాలి. అంతలోనే వాట్సాప్‌లో సందేశం. దానికి బదులిచ్చేలోపు.. ఇంకో యాప్‌లో మ్యాచ్ మొదలైందన్న నోటిఫికేషన్. పని కాస్తా పెండింగ్! బంతి బంతినీ లైవ్‌లో చూసే టెక్నాలజీ యుగంలో ఉండగా.. అడపాదడపా స్కోర్ చూసి సంతృప్తిపడేవాళ్లు ఎంతమంది ఉంటారు? లైవ్ చూస్తూనే.. డ్రీమ్ ఎలెవన్ తరహా యాప్‌లతో బెట్టింగ్‌లకు పాల్పడటం ఇప్పుడు రివాజు! ఉద్యోగులు ఇలాంటి రకరకాల డిజిటల్ పద్మవ్యూహాల్లో చిక్కకుండా కాపాడుకోవడం ఆయా సంస్థల బాధ్యత. అందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరమూ ఉంది.
డిజిటలైజేషన్ ఉద్యోగికి వరంగా చెప్పేవాళ్లూ ఉన్నారు. పెద్ద శాపంగా భావించేవాళ్లూ ఉన్నారు. సాంకేతికత సాయంతో పనిభారం తగ్గింది అనడంలో సందేహం లేదు. కానీ, డిజిటల్ టూల్స్ వాడకం విపరీతంగా పెరగడం వల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురువుతున్నారు కూడా! అంతేకాదు, రకరకాల అప్లికేషన్లలో తొంగిచూస్తూ పనివేళల్లో పక్కదారీ పడుతున్నారు. కొన్నిసార్లు ఊహించని సమస్యల్లో చిక్కుకుంటున్నవాళ్లూ ఉన్నారు. పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో ఈ గ్యాడ్జెట్లు, యాప్‌ల వినియోగంతో రకరకాల సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఇ-కామర్స్ మోసాలకు గురవుతున్నారు. ఆన్లైన్లో ఫ్రాడ్‌స్టర్ల చేతికి చిక్కుతున్నారు. క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్, ఆన్లైన్ గేమింగ్, జాబ్ ఫ్రాడ్, సైబర్ బుల్లీయింగ్, సెక్సువల్ అబ్యూస్ లాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్లు ప్రతి కార్యస్థలంలో తారసపడతారు. పనిచేసే చోట సురక్షితమైన డిజిటల్ ఎకో సిస్టమ్ ఉండేలా చూసుకోవాల్సింది సంస్థలే. డిజిటల్ దునియాలో ఎలా మసలుకోవాలో ఉద్యోగులకు అవగాహన కల్పించాలి. అప్పుడే మానవ వనరులను సమర్థంగా ఉపయోగించుకున్నట్టు అవుతుంది.
ఉద్యోగులకు అండగా…
అవగాహన కల్పించేలా: పనివేళల్లో ఇంటర్నెట్ వినియోగం వల్ల కలిగే నష్టాలను ఉద్యోగులకు తెలియజేయాలి. తరచూ వర్క్‌షాప్‌లు, శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉద్యోగుల టెక్నాలజీ అభిరుచులను మార్చే ప్రయత్నం చేయాలి. సమయపాలన ఆవశ్యకతను తెలియజేయాలి. డివైజ్ వాడకాన్ని తగ్గించే మార్గాలూ ఉపదేశించాలి.
హద్దులు తెలిసేలా: పనివేళలో వ్యక్తిగత ఆసక్తులు తొంగిచూడటం మామూలే! ఫోన్ చేతిలో ఉన్నప్పుడు అడపాదడపా చూడటమూ సహజమే!! అలాగే ఇంటికి వెళ్లాక ఆఫీస్ పనులు చేయాల్సి రావడం అనుభవమే! కానీ, పనికీ, వ్యక్తిగత జీవితానికీ మధ్య ఉన్న సన్నటి గీతను తెలుసుకోగలిగితే ఏ ఇబ్బందీ రాదు. ఆఫీస్ వేళలో కుటుంబసభ్యులతో చాట్ చేయడం, ఇంటికి వెళ్లాక డిజిటల్ వర్క్ చేయడమూ రెండిటినీ వీలైనంత వరకు కట్టడి చేయాలి.
విరామాలు తప్పనిసరి: పొద్దస్తమానం కంప్యూటర్లకు అతుక్కుపోయిన ఉద్యోగులకు మధ్యలో విరామం ఇవ్వడం అవసరం. అంతేకాదు, టీ బ్రేక్‌తోపాటు తేలికపాటి వర్కవుట్లు చేసుకునే వెసులుబాటు కల్పించాలి. అప్పుడు ఉద్యోగులను విరామ సమయాల్లో గ్యాడ్జెట్స్ జోలికి వెళ్లకుండా కట్టడి చేసినట్టూ అవుతుంది. వాళ్లకు ఆటవిడుపు అందించినట్టూ అవుతుంది. దీంతోపాటు వారానికి ఒకసారైనా ధ్యానం తరగతులు నిర్వహిస్తే ఉద్యోగులకు అదనపు ప్రశాంతత చేకూరుతుంది.
ఒత్తిడి లేకుండా: కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ మొదలైంది. ఇప్పటికీ హైబ్రిడ్ పేరుతో సగం పనిదినాలు ఇంట్లో ఉండి పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి పలు కంపెనీలు. అయితే, ఈ విధానం కొనసాగించడం వల్ల ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించే అవకాశం ఉంటుంది. సమావేశాల పేరుతో ఆన్లైన్లో ఎక్కువ సమయం గడపకుండా ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ ఇవ్వడం మంచిది.
డిజిటల్ డిటాక్స్: డిజిటల్ గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండేలా ఉద్యోగులను ప్రోత్సహించాలి. ఆఫీస్ వేళల్లోనూ గంటో, అరగంటో మొబైల్‌కు దూరంగా ఉండే నియమం పెట్టాలి. దీనిని పాటించిన వారికి ప్రత్యేక బహుమతులు ప్రకటిస్తే ఇతరులు కూడా ఈ దిశగా ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యకర వాతావరణం: వర్క్‌ప్లేస్ ఉన్నతంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత సంస్థలదే! టేబుల్, చెయిర్ ఎత్తు అడ్జస్ట్ చేసుకునేలా ఉండాలి. వెన్నెముకపై ఒత్తిడి లేకుండా ఉండే కుర్చీలు అందుబాటులో ఉంచాలి. అంతేకాదు, గంటల తరబడి పని చేస్తున్నప్పుడు ఏ పొజిషన్లో కూర్చోవాలో నిపుణుల ద్వారా ఉద్యోగులకు తెలియజేయాలి.
ఎవరికి వారే కట్టడి: స్క్రీన్ టైమ్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ప్రత్యేకమైన డిజిటల్ వెల్బీయింగ్ యాప్‌లు కూడా ఉన్నాయి. వాటి సాయంతో ఉద్యోగుల స్క్రీన్ టైమ్ తెలుసుకోవచ్చు. మితిమీరి గ్యాడ్జెట్స్ వాడుతున్న ఉద్యోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది.

Employee1
డిజిటల్ విక్టరీ
సంస్థలో తరచూ సదస్సులు నిర్వహిస్తుండాలి. డిజిటల్ డిటాక్స్, సమాచార భద్రత, యాప్ అనుమతులు, సోషల్ మీడియా మేనేజ్మెంట్, డిజిటల్ పేరెంటింగ్, డేటా సేఫ్టీ తదితర అంశాలపై చర్చించడం వల్ల డిజిటల్ విక్టరీ సాధ్యమే!
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read More :
Tech Tips | ఫేస్బుక్లో స్పామర్ల బారిన పడి మోసపోవద్దంటే ఈ టిప్స్‌ను కచ్చితంగా పాటించండి
Tech Tips | మీ ఫోన్ పోయిందా? సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దంటే ఈ జాగ్రత్తలు మస్ట్!
“Deep Fakes | ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న డీప్ ఫేక్స్.. ఇవి ఎందుకంత డేంజర్?”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

