ChatGPT | ఇప్పుడు టెక్నాలజీ వరల్డ్‌లో `చాట్‌జీపీటీ (ChatGPT)` పాపులర్. ఒకరకంగా దిగ్గజ టెక్ సంస్థలనే షేక్ చేస్తున్నది. గూగుల్ మాదిరే మనకు తెలియని సమాచారం గురించి అడిగితే క్షణాల్లో అందిస్తున్నది చాట్‌బోట్ చాట్‌జీపీటీ (Chatbot ChatGPT). ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence-AI) టూల్ ఆధారంగా పని చేస్తున్నది. చాట్ జీపీటీ గతేడాది నవంబర్ 30న పురుడు పోసుకున్నది. రెండు నెలలు తిరక్కముందే జనవరిలో 10 కోట్ల మంది యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకున్నది.
ఇంటర్నెట్ చరిత్రలో శరవేగంగా ఎదుగుతున్న కన్జూమర్ యాప్‌గా నిలిచింది చాట్ జీపీటీ (ChatGPT). జనవరిలో ప్రతి రోజూ 1.3 కోట్ల మంది యూజర్లు చాట్ జీపీటీ జాబితాలో చేరిపోయారు. చాలా మందికి ఉపయోగంగా ఉన్నా.. ఆందోళన కూడా వెంటాడుతున్నది. చాట్ జీపీటీ (ChatGPT) వల్ల భారీ స్థాయిలో వైట్‌కాలర్ జాబ్స్‌కు ముప్పు పొంచి ఉందా? అన్న అనుమానాలు ఉన్నాయి. విద్యా సంస్థల్లోనూ ChatGPTపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. అయితే, ఇప్పటికిప్పుడు దీనివల్ల ముప్పు ఉండకపోవచ్చు.
చాట్‌జీపీటీ (ChatGPT) ఒక విప్లవమే. దీని రాక తప్పదు.. ఉత్పాదక కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా చాట్‌జీపీటీ (ChatGPT)కి పరిమితులు ఉన్నాయి. ప్రస్తుతం 2021 వరకు అందుబాటులో ఉన్న డేటా మాత్రమే అందిస్తున్నది. పక్షపాత పూరిత సమాచారం కూడా ఇందులో ఉండొచ్చు. తప్పు జవాబులు కూడా ఇస్తున్నది. దీనిపై నమ్మదగిన ఆప్షన్ కాదు. చాట్‌జీపీటీ (ChatGPT)కి మానవుల మాదిరిగా కామన్సెన్స్ ఉండదు. ఇదేమీ కొత్తగా సమాచారం డెవలప్ చేయడం లేదు.
అందుబాటులో ఉన్న డేటాకు అనుగుణంగా మాత్రమే డేటా జనరేట్ చేయగలుగుతుంది చాట్‌జీపీటీ (ChatGPT). మున్ముందు ఇది శరవేగంగా వృద్ధి చెందొచ్చు. అందువల్లే పలు ఉద్యోగాలు ముప్పు అంచున చిక్కుకున్నాయని చెబుతున్నారు. భారత్‌లోని ఐటీ సంస్థలకు కూడా వర్తిస్తుంది. చాట్ జీపీటీ (ChatGPT) ధాటిని ఎదుర్కోవాలంటే ఐటీ నిపుణుల స్కిల్స్ డెవలప్ చేయడం బెటర్ అన్న అభిప్రాయం వినిపిస్తున్నది. చాట్‌జీపీటీ ఒక రివల్యూషన్ కనుక దాంతో పోటీ పడటం ముఖ్యోద్దేశం కాదు..
గతంలో కంప్యూటర్ అందుబాటులోకి వచ్చినప్పుడు.. అది ఉద్యోగాలను కుదించేస్తుందన్న మూట గట్టుకున్నది. కానీ ఆ అపప్రధకు భిన్నంగా జరిగింది. వర్క్ వేగంగా ప్రారంభమైంది. గతంలో కంప్యూటర్ సేవల మాదిరిగానే చాట్ జీపీటీ (ChatGPT) కూడా సమయం వృధా కానివ్వదు. స్కిల్స్ నేర్చుకోని, డెవలప్ చేసుకోని వారికి మాత్రమే చాట్ జీపీటీ డిఫరెన్స్‌గా ఉంటుంది. చాట్ జీపీటీ (ChatGPT) టూల్ వల్ల సమీప భవిష్యత్‌లో ఉత్పాదకత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఫోర్బ్స్ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్‌లు 14 రెట్లు పెరిగాయి. సమీప భవిష్యత్‌లో బిజినెస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా మారుతుందని వివిధ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు 72 శాతం చెబుతున్నారు.
చాట్ జీపీటీ అంటే మెషిన్ లెర్నింగ్ స్టిస్టమ్ అప్లికేషన్. డేటా నుంచి నేర్చుకుని రీసెర్చ్ ద్వారా ఫలితాలు వెల్లడిస్తుంది. దీని సాయంతో టెక్స్ట్‌కు బదలు 3డీ ఇమేజ్‌లు క్రియేట్ చేయొచ్చు. టీచర్లు తమ వద్ద ఉన్న పరిజ్ఞానం పెంచుకోవడానికి మరింత కేంద్రీకరించాలి. విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని అదనపు టూల్‌గా చేర్చాలి. లేని పక్షంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ కాలం చెల్లిన వ్యవస్థగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. శామ్ ఆల్ట్మాన్ తన ఎనిమిదో ఏటనే కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. 16వ ఏట ఇంటి నుంచి బయటకు వచ్చాడు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన రెండేండ్లకు మొబైల్ యాప్స్ తయారీ ప్రారంభించాడు.