ఏఐ దుర్వినియోగంపై చాట్‌జీపీటీ క్రియేటర్ కీలక వ్యాఖలు
చాట్‌జీపీటీతో ఏఐ ఆధారిత ప్లాట్‌ఫాంలు వనరులు, సమయాన్ని పెద్ద ఎత్తన ఆదా చేస్తాయని పలువురు చెబుతుండగా ఈ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో కొలువుల కోతకు ఆస్కారం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కొద్దినెలల కిందట లాంఛ్ అయిన చాట్‌జీపీటీకి యూజర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. చాట్‌జీపీటీతో ఏఐ ఆధారిత ప్లాట్‌ఫాంలు వనరులు, సమయాన్ని పెద్ద ఎత్తన ఆదా చేస్తాయని పలువురు చెబుతుండగా ఈ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో కొలువుల కోతకు ఆస్కారం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చాట్‌జీపీటీ క్రియేటర్ వేరొక వాదన తెరపైకి తీసుకువచ్చారు. ఏఐ ప్లాట్‌ఫాంలపై నియంత్రణ కొరవడితే పరిస్ధితులు దిగజారుతాయని చాట్‌జీపీటీ, దాల్-ఈ సృష్టికర్త ఓపెన్ఏఐ సీటీఓ మిరా మురాటి ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఏఐ దుర్వినియోగమవుతుందనే భయాందోళన వ్యక్తం చేసిన మురాటి కృత్రిమ మేథ చెడు ఉద్దేశాలు కలిగిన వారి చేతిలో పడే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో మమేకమైన వారంతా కూర్చుని కొన్ని నియంత్రణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇప్పటికైనా ఈ దిశగా చొరవ చూపాలని పిలుపు ఇచ్చారు. ఏఐ ఆధారిత చాట్‌బాట్ అద్భుత విజయం పట్ల కంపెనీ సంతోషంగా ఉందని పేర్కొన్నారు. చాట్‌జీపీటీ విజయం సంతృప్తి ఇచ్చిందని అయితే ఇంకా సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు.
టెక్ ప్రపంచంలో పురుడుపోసుకున్న పసికూనకు యూజర్ల నుంచి ఇంతటి అద్భుత స్పందన వస్తుందని తాము అంచనా వేయలేదని అన్నారు. పలు సందర్భాల్లో చాట్‌జీపీటీ అసత్య సమాధానాలు ఇచ్చినట్టు ఓపెన్ఏఐ గుర్తించిందని, హానికారక సూచనలు, వివక్షతో కూడిన కంటెంట్‌ను కూడా చాట్‌బాట్ యూజర్లకు చేరవేసిందని కూడా అధికారిక వెబ్సైట్ గుర్తించిందని తెలిపారు. ఇది చాట్‌జీపీటీకే పరిమితం కాలేదని, సాధారణంగా జనరేటివ్ ల్యాంగ్వేజ్ మోడల్స్‌తో ఉత్పన్నమయ్యే సమస్యని చెప్పుకొచ్చారు. నియంత్రణలపై మిరా మురాటి మాట్లాడుతూ ఓపెన్ఏఐ వంటి కంపెనీలు తమ టూల్స్ బాధ్యతాయుతంగా, నియంత్రణతో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

