న్యూఢిల్లీ : గ్లోబల్ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతున్నా ఎంట్రీలెవెల్, మధ్య శ్రేణి బడ్జెట్ ఫోన్లపై కంపెనీల ఫోకస్ తగ్గలేదు. బడ్జెట్ ఫోన్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ సెగ్మెంట్లో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టేందుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అందుబాటు ధరలో తాజా ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లే టార్గెట్‌గా ఆయా కంపెనీలు పలు ప్రోడక్ట్‌లతో ఆకట్టుకుంటున్నాయి. జూన్‌లో రూ 15,000 లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే వారు ఈ బడ్జెట్ ఫోన్లపై దృష్టి సారించవచ్చు. భారత్‌లో రియల్‌మి, రెడ్మి, వివో ఇటీవల బడ్జెట్ ఫోన్లను లాంఛ్ చేశాయి.
వివో టీ1 44 డబ్ల్యూ
ఫాస్ట్‌చార్జింగ్ బ్యాటరీకి ప్రాధాన్యత ఇచ్చే వారు వివో టీ1 44డబ్ల్యూను పరిశీలించవచ్చు. వివో టీ1 44డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ అమోల్డ్ డిస్ప్లే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను కలిగిఉంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది. రూ 14,449 నుంచి అందుబాటులో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ ప్లిఫ్‌కార్ట్‌లో లభిస్తుంది.
రియల్‌మి సీ 35
భారీ బ్యాటరీ, భారీ డిస్ప్లే, ఆకట్టుకునే డిజైన్‌ను ఇష్టపడే వారు ఇటీవల లాంచ్ అయిన రియల్‌మి సీ35 మెరుగైన ఆప్షన్‌గా మారింది. రియల్‌మి సీ35 6.6 ఇంచ్ ఫుల్హెచ్డీ డిస్ప్లేతో ట్రిపుల్ కెమరా సెటప్‌తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ టీ616 ప్రాసెసర్‌ను కలిగిఉంది. 18డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ను సపోర్ట్ చేసే 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ రూ 11,999 నుంచి అందుబాటులో ఉంటుంది.
ఒప్పో కే10
ఈ ఏడాది మార్చిలో ఒప్పో తొలి కే సిరిఈస్ ఫోన్ కే10ను భారత్‌లో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ 5జీ వెర్షన్‌ను ఈ వారంలో కంపెనీ లాంఛ్ చేయనుంది. డిజైన్, కెమెరాలను ఇష్టపడేవారికి కే10 గుడ్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ప్రీమియం రెనో సిరీస్ ఫోన్ల్లో వాడే రెనో గ్లో డిజైన్‌తో ఒప్పో కే10 ముందుకొచ్చింది. ఒప్పో కే10 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు వెనుక భాగంలో రెండు కెమెరాలున్నాయి. 33డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్ చేసే 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ఒప్పో కే10 రూ 14,990 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంది.