Best Smartphone Games : గేమ్ లవర్స్ ఫిదా అయిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్ గేమ్స్ ఇవే

ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. కొందరికి గేమ్స్ ఆడటమంటే పిచ్చి. పొద్దున లేస్తే గేమ్స్ ఆడుతూ ఉంటారు. బెస్ట్ గేమ్స్ ఏంటో తెలుసుకొని వాటిన ఆడుతూ టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే.. అన్ని గేమ్స్ కన్నా.. పబ్జీ గేమ్ మాత్రం చాలా పాపులర్ అయింది. అయితే.. 2021లో గేమ్ లవర్స్‌ను ఫిదా చేసిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ గేమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
PUBG MOBILE

పబ్జీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ గేమ్ లో ఒకేసారి 100 మంది వరకు యాడ్ అయి అందరూ కలిసి బ్యాటిల్ రాయల్ మోడ్‌లో గేమ్ ఆడొచ్చు. ఇందులో 4v4 Team Deathmatch modes, Zombie modes లాంటి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి.
Honour of Kings

ఈ గేమ్ ఇంటర్నేషనల్ వర్షన్‌ను ఎరీనా ఆఫ్ వలోర్ అని అంటారు. ఇది కూడా ఒకరి కంటే ఎక్కువ మంది ఒకేసారి ఆడుకునే గేమ్. దీన్నే మల్టీప్లేయర్ ఆన్లైన్ బ్యాటిల్ ఎరీనా(ఎంవోబీఏ) అని పిలుస్తారు.
Among Us

ఎమాంగ్ అజ్.. అనే గేమ్‌ను ఇన్నర్స్లాత్ అనే కంపెనీ డెవలప్ చేసింది. ఇందులో 4 నుంచి 10 మంది ప్లేయర్ల వరకు ఒకేసారి ఆడే చాన్స్ ఉంటుంది. ఒక స్పేస్‌షిప్‌లో ఉండే సభ్యులు తప్పిపోతే.. వాళ్లను వెతకడమే ఈ గేమ్.
Candy Crush Saga

ఈ గేమ్‌లో కాండీలను మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌ను ఒక్కరే ఆడొచ్చు. లేదంటే ఫ్రెండ్స్‌తో కూడా ఆడొచ్చు.
ROBLOX

ఇది క్రాస్ ప్లాట్‌ఫామ్‌ను సపోర్ట్ చేసే గేమ్. ఈ గేమ్‌ను కంప్యూటర్లలో, మొబైల్ డివైజ్‌లలో, ఎక్స్‌బాక్స్ వన్, వీఆర్ హాండ్సెట్ ఉపయోగించి కూడా ఆడొచ్చు.
Free Fire

ఫ్రీ ఫైర్ అనేది షూటర్ గేమ్. 10 నిమిషాల్లో ఈ గేమ్ లేవల్ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
Ludo King

ఇది క్లాసిక్ బోర్డ్ గేమ్. ఈ గేమ్‌ను నలుగురు ప్లేయర్స్ వరకు ఆడొచ్చు. దీంట్లో వీడియో చాట్ ఆప్షన్ కూడా ఉంటుంది.
Game For Peace

గేమ్ ఫర్ పీస్ అనేది చైనీస్ వర్షన్ పాపులర్ బ్యాటిల్ రాయలె గేమ్.. పబ్జీ మొబైల్. పబ్జీకి ఇది ఆల్టర్నేట్ వర్షన్ గేమ్.
Minecraft Pocket Edition

ఇది కూడా క్రాస్ ప్లాట్‌ఫామ్ గేమ్. క్రాస్ ప్లాట్‌ఫామ్ ద్వారా.. 10 మంది ఫ్రెండ్స్ వరకు ఈ గేమ్‌లో యాడ్ అయి ఆడొచ్చు. ఈ గేమ్ ద్వారా.. ప్లేయర్లు హోమ్, క్యాస్టిల్ నిర్మాణం చేపట్టొచ్చు.
Call of Duty: Mobile

మల్టీప్లేయర్ మ్యాప్స్ ఫీచర్‌తో ఈ గేమ్‌ను డిజైన్ చేశారు. మల్టీప్లేయర్ మ్యాప్స్, మోడ్స్‌తో ఎప్పుడైనా 100 మంది ప్లేయర్లతో ఈ గేమ్‌ను ఆడొచ్చు. బ్యాటిల్ రాయలె బ్యాటిల్‌గ్రౌండ్, 5వీ5 టీమ్ డెత్ మ్యాచ్ ఆడొచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

