న్యూఢిల్లీ: ఐఫోన్ యూజర్ల కోసం ఆపిల్ సంస్థ ఓ కొత్త సపోర్ట్ పేజీని పబ్లిష్ చేసింది. ఇందులో ముఖ్యంగా ఐఫోన్ కెమెరా దెబ్బతినే అవకాశాలపై యూజర్లను హెచ్చరించింది. హైపవర్ మోటార్ సైకిల్స్‌పై వెళ్తున్న సమయంలో వాటి నుంచి వచ్చే వైబ్రేషన్ల వల్ల ఐఫోన్ కెమెరా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆపిల్ చెప్పింది. కొన్ని ఐఫోన్ మోడల్స్‌లో అత్యాధునిక కెమెరా వ్యవస్థ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, క్లోజ్డ్ లూప్ ఆటోఫోకస్ వంటి ఫీచర్లు వీటిలో ఉన్నాయి. కదులుతున్న సమయంలో, వైబ్రేషన్స్ వల్ల తీసే ఫొటో దెబ్బతినకుండా ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి.
అయితే ఐఫోన్‌ను చాలా ఎక్కువ మొత్తంలో వైబ్రేషన్స్ కలిగించే హై పవర్ మోటార్ సైకిల్స్‌కు అటాచ్ చేయకూడదని ఆపిల్ సంస్థ యూజర్లకు సూచించింది. బైక్ హ్యాండిల్‌కు మొబైల్‌ను చాలా మంది అటాచ్ చేస్తుంటారు. ఆ సమయంలో బైక్ నుంచి వచ్చే వేబ్రేషన్స్ ఫోన్ కెమెరాను దెబ్బ తీసే ప్రమాదం ఉందని ఆపిల్ హెచ్చరించింది. బైక్‌కు మీ ఐఫోన్‌ను అటాచ్ చేస్తే అందులోని ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్ దెబ్బతినవచ్చని తెలిపింది. ఇది ఫొటోల క్వాలిటీపై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ కాలం పాటు ఇలాంటి వైబ్రేషన్స్‌కు గురికాకుండా చూసుకోవాలని సూచించింది. ఈ ఓఐఎస్, ఆటో ఫోకస్‌లు ఐఫోన్ 6 ప్లస్, 6ఎస్ ప్లస్, 7, ఎస్ఈ (సెకండ్ జనరేషన్) మోడల్స్‌లో అందుబాటులో ఉంది.