Instagram Plus | త్వరలో ఇన్స్టాగ్రామ్ ప్లస్.. పెయిడ్ సర్వీస్ తేనున్న మెటా.. అదిరిపోయే ఫీచర్లు
Instagram Plus : సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో కీలక మార్పులు జరగనున్నాయి. యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటా.. పెయిడ్ సర్వీస్ ప్రారంభించబోతుంది.
Instagram Plus : సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో కీలక మార్పులు జరగనున్నాయి. యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటా.. పెయిడ్ సర్వీస్ ప్రారంభించబోతుంది. ‘ఇన్స్టాగ్రామ్ ప్లస్’ పేరుతో కొత్త పెయిడ్, సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకురానున్నట్లు సమాచారం. ఇది ప్రీమియమ్ సర్వీస్ కాబట్టి, కొన్ని కొత్త ఫీచర్లు వీరికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై అధికారిక ప్రకటన రాలేదు.
కానీ, కొన్ని టెక్ మీడియా సంస్థల సమాచారం ప్రకారం.. ఈ సర్వీస్‌ను ఇప్పటికే బీటా వెర్షన్లో కొన్ని దేశాల్లో పరీక్షిస్తున్నారు. మెక్సికో, జపాన్, ఫిలిప్పైన్స్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ప్లస్ నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నవారికోసమే కొన్ని ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో ముఖ్యమైంది అనానిమస్ స్టోరీ వ్యూ. అంటే ఇతర యూజర్లకు తెలియకుండానే వారి స్టోరీలను చూడవచ్చు. ఒకవేళ మీరు ఈ ప్లాన్ తీసుకుంటే ఇతర యూజర్లకు తెలియకుండా ఇన్‌స్టాలో వారి స్టోరీ చూడవచ్చు. అలా ఎంతమంది స్టోరీ అయినా రహస్యంగా చూడొచ్చు. ఆ విషయం వారికి తెలియదు. అలాగే మీ స్టోరీని, ఎవరు ఎన్నిసార్లు చూశారో కూడా తెలుసుకోవచ్చు. అలాగే, స్టోరీ చూసేందుకు అపరిమితమైన ఆడియెన్స్ లిస్ట్ తయారు చేయొచ్చు. ప్రస్తుతం స్పెషల్ స్టోరీలకు సంబంధించి ఏదైనా ఒక ఫ్రెండ్స్ లిస్ట్ మాత్రమే తయారు చేయవచ్చు. అలాగే, స్టోరీలను మరో 24 గంటలపాటు అదనంగా ఉంచుకోవచ్చు.
వారానికో స్టోరీని స్పాట్‌లైట్‌లో ఉంచవచ్చు. అలాగే, స్టోరీలకు యానిమేటెడ్ సూపర్ లైక్స్ సెండ్ చేయొచ్చు. ఇక, ఈ ఫీచర్ ఇప్పటివరకు క్రియేటర్లకు, బిజినెస్ అకౌంట్లకు ఉన్న వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌కు భిన్నమైంది. ఇది సెపరేట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్. దీని ధరలకు సంబంధించి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, ఇతర దేశాల్లో సగటున రూ.200 వరకు నెలవారీ ఛార్జ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

