Apple Back to School Sale 2025 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా బ్యాక్ టు స్కూల్ సేల్‌ను ప్రారంభించింది. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అయిన నేపథ్యంలో భారత్‌లో బ్యాక్ టు స్కూల్ 2025 పేరిట ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు యాపిల్‌కు చెందిన పలు ఉత్పత్తులపై భారీ రాయితీలను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. విద్యార్థులు యాపిల్‌కు చెందిన పలు ప్రొడక్ట్ లను బండిల్స్ రూపంలో కొంటే భారీ ఎత్తున రాయితీలను పొందవచ్చు. యాపిల్ మాక్ లేదా ఐప్యాడ్‌ను కొంటే బండిల్‌గా ఎయిర్‌పాడ్స్, యాపిల్ పెన్సిల్ లేదా ఇతర ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
మాక్‌బుక్ ఎయిర్ లేదా మాక్‌బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తే మ్యాజిక్ మౌస్, మ్యాజిక్ ట్రాక్‌పాడ్, మ్యాజిక్ కీబోర్డ్, ఎయిర్ పాడ్స్ 4 వంటి ఐటమ్స్‌ను తగ్గింపు ధరలకు పొందవచ్చు. ఐప్యాడ్లపై కూడా ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఐప్యాడ్ ఎయిర్ లేదా ఐప్యాడ్ ప్రొ ట్యాబ్‌లను కొంటే యాపిల్ పెన్సిల్ ప్రొ లేదా ఎయిర్ పాడ్స్ 4ను తగ్గింపు ధరలకు పొందవచ్చు. ఒక విద్యార్థి ఈ ఆఫర్లలో ఏదైనా ఒక ఆఫర్‌ను మాత్రమే పొందే వీలు కల్పించారు. ఐప్యాడ్‌ను కొన్న విద్యార్థులు రూ.5వేల తగ్గింపుతో ఎయిర్‌పాడ్స్ 4ను, రూ.12వేల తగ్గింపుతో ఎయిర్‌పాడ్స్ ప్రొ 2ను, రూ.14వేల తగ్గింపుతో మ్యాజిక్ కీబోర్డ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ 11, 13 మోడల్స్‌కు గాను మ్యాజిక్ కీబోర్డును కొంటే రూ.17వేల నుంచి రూ.21వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
మాక్‌బుక్‌ను కొనుగోలు చేస్తు రూ.7వేల తగ్గింపుతో ఎయిర్‌పాడ్స్ ప్రొ 2ను పొందవచ్చు. అలాగే మ్యాజిక్ మౌస్, మ్యాజిక్ ట్రాక్‌ప్యాడ్, మ్యాజిక్ కీబోర్డులపై కూడా రాయితీలను పొందవచ్చు. ఐమ్యాక్‌ను కొనుగోలు చేస్తే ఎయిర్‌పాడ్స్ 4 లేదా ఎయిర్ పాడ్స్ ప్రొ 2ను డిస్కౌంట్ ధరలకు ఇస్తారు. ఇక బండిల్ ప్లాన్‌లో భాగంగా విద్యార్థులు యాపిల్ టీవీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఇందుకు గాను యాపిల్ మ్యూజిక్ స్టూడెంట్ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు పలు రకాల పేమెంట్ ఆప్షన్లను అందుబాటులో ఉంచారు. క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు, రూపే కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
మాక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే అందుబాటులో ఉన్న మోడల్స్ మాత్రమే కాకుండా విద్యార్థులు తమకు నచ్చిన కాన్ఫిగరేషన్‌తో మాక్‌ను ఆర్డర్ చేయవచ్చు. దీనిపై కూడా ఈఎంఐ సదుపాయం కల్పిస్తారు. వివిధ రకాల ఎమోజీలు, కావల్సిన టెక్ట్స్‌తో యాపిల్ ఉత్పత్తులపై ఉచిత ఎన్గ్రేవింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఏవైనా సలహాలు కావాలంటే యాపిల్ ఆన్లైన్ స్టోర్ లో నిపుణులను కూడా సంప్రదించే వెసులు బాటు కల్పించారు. స్కూల్స్‌కు వెళ్లే విద్యార్థులు మాత్రమే కాకుండా కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్థులు సైతం యాపిల్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇందుకు గాను విద్యార్థులు తమ ఐడీ కార్డు, ఇతర పత్రాలను చూపించి తమకు సమీపంలో ఉన్న యాపిల్ స్టోర్ లేదా యాపిల్ డీలర్ వద్ద తమకు కావల్సిన ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయవచ్చు. యాపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌లోనూ విద్యార్థులు తమకు కావల్సిన ప్రొడక్ట్స్‌ను రాయితీలకు కొనుగోలు చేయవచ్చు.