Amazon Prime Day Sale 2025 | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో ప్రైమ్ డే సేల్ ను నిర్వహించనుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సేల్‌లో భాగంగా పలు ఉత్పత్తులపై కళ్లు చెదిరే డీల్స్‌ను, ఆఫర్లను అందించనున్నారు. కేవలం ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ సేల్‌ను నిర్వహిస్తున్నారు. సేల్‌లో భాగంగా పలు కంపెనీలు నూతన ఉత్పత్తులను సైతం లాంచ్ చేయనున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, టీవీలు, గృహోపకరణాలు, అమెజాన్ డివైస్‌లు, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు, ఫర్నిచర్, కిచెన్ ఐటమ్స్, కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులపై కూడా ఆఫర్లను అందించనున్నారు. సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 13 ఫోన్‌ను రూ.59వేల ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5జి ఫోన్‌ను రూ.74,999 ధరకు కొనవచ్చు.
ఈ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.57,999గా ఉంది. ఐక్యూ నియో 10ఆర్ 5జి స్మార్ట్ ఫోన్‌ను రూ.23,499కు, వన్‌ప్లస్ 13ఎస్ స్మార్ట్ ఫోన్‌ను రూ.49,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు డిస్కౌంట్ రూ.5వేలు లభిస్తుంది. ఈ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తున్నారు. లావాకు చెందిన అగ్ని 3, ఓ3, ఓ3 ప్రొ, బోల్డ్ ఎన్1 ప్రొ, బోల్డ్ ఎన్1, బ్లేజ్ 3, స్మార్మ్ లైట్, స్టార్మ్ ప్లే, స్టార్మ్ 5జి ఫోన్లను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. రియల్‌మికి చెందిన జీటీ7ప్రొ, జీటీ7, జీటీ 7టి, నార్జో 80 ప్రొ 5జి, నార్జో 80 ఎక్స్ 5జి ఫోన్లను కూడా ఈ సేల్‌లో తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్, శాంసంగ్, రియల్‌మి, బోట్, సెన్‌హెయిసర్ వంటి కంపెనీలకు చెందిన ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్‌ను భారీ తగ్గింపు ధరలకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే జేబీఎల్ స్పీకర్లను కూడా తగ్గింపు ధరలకు అందించనున్నారు. లెనోవో, హెచ్‌పీ, అసుస్ కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ ట్యాబ్‌ను రూ.23,249 ధరకు కొనుగోలు చేయవచ్చు. సోనీ, షియోమీ, ఎల్జీ, టీసీఎల్ కంపెనీలకు చెందిన టీవీలను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. బాష్, హయర్ కంపెనీలకు చెందిన గృహోపకరణాలపై కూడా తగ్గింపు ధరలన పొందవచ్చు. ఇంకా ఎన్నో ఉత్పత్తులపై కళ్లు చెదిరే ఆఫర్లు, డీల్స్‌ను ఈ సేల్‌లో భాగంగా అందించనున్నారు.
ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు కార్డులతో ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు డిస్కౌంట్, 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. అమెజాన్ పే యూపీఐ ట్రాన్సాక్షన్ల ద్వారా వస్తువులను కొంటే రూ.100 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అర్హులైన కస్టమర్లకు అమెజాన్ పే లేటర్ ద్వారా రూ.60వేల వరకు లోన్‌ను పొందే సౌకర్యం కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 12న అర్థరాత్రి 12 నుంచి ప్రారంభమై జూలై 14న అర్థరాత్రి 11:59 గంటలకు ముగియనుంది. సేల్ జరిగే రోజుల్లో పలు ఉత్పత్తులపై ప్రత్యేక డీల్స్‌ను అందించనున్నారు. మరిన్ని వివరాలకు అమెజాన్‌లో సేల్ పేజ్‌ను సందర్శించవచ్చు.