Amazon Mega Tablet Premier League Sale | మీరు ట్యాబ్లెట్ కొనాలని చూస్తున్నారా.. అయితే మీకు అమెజాన్ గొప్ప అవకాశం అందిస్తోంది. మెగా ట్యాబ్లెట్ ప్రీమియర్ లీగ్ సేల్ పేరిట అమెజాన్ ఓ నూతన సేల్‌ను తాజాగా ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ట్యాబ్‌లను చాలా తగ్గింపు ధరలకే వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీల ట్యాబ్‌లను యూజర్లు డిస్కౌంట్ ధరలకు కొనవచ్చు. రూ.13,999 ప్రారంభ ధరకు ఈ ట్యాబ్లెట్లు లభిస్తున్నాయి. ఈ సేల్‌ను మే 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా హానర్ ప్యాడ్ ఎక్స్9 ట్యాబ్‌ను కేవలం రూ.13,999 ధరకే కొనవచ్చు. ఈ ట్యాబ్‌తోపాటు ఉచితంగా ఫ్లిప్ కవర్‌ను కూడా అందిస్తున్నారు. ఇందులో 11.5 ఇంచుల 2కె డిస్ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 13 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
లెనోవో ట్యాబ్ ప్లస్ ట్యాబ్లెట్‌ను రూ.18,998 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్‌తోపాటు బిల్టిన్ కిక్ స్టాండ్ ఉచితంగా లభిస్తుంది. 11.5 ఇంచ్ 2కె డిస్ప్లే, జేబీఎల్ హైపై స్పీకర్స్, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఫాస్ట్ చార్జర్ వంటి ఫీచర్లను ఈ ట్యాబ్‌లో అందిస్తున్నారు. వన్ ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్‌ను ఈ సేల్‌లో రూ.16,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.1000 కూపన్ కూడా లభిస్తుంది. 11.35 ఇంచ్ 2.4కె డిస్ప్లే, డాల్బీ అట్మోస్, క్వాడ్ స్పీకర్స్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వంటి ఫీచర్లను ఇందులో పొందవచ్చు. రెడ్మీ ప్యాడ్ ప్రొ ట్యాబ్‌ను ఈ సేల్‌లో రూ.19,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్‌లో 12.1 ఇంచ్ డిస్ప్లే, 33 రోజుల వరకు స్టాండ్ బై బ్యాటరీ బ్యాకప్, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, క్వాడ్ స్పీకర్స్, వైఫై 6 వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
షియోమీ ప్యాడ్ 6 ట్యాబ్‌లో స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 144 హెడ్జ రిఫ్రెష్ రేట్, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 2.8కెప్లస్ డిస్ప్లే, డాల్బీ విజన్ అట్మోస్, క్వాడ్ స్పీకర్స్ తదితర ఫీచర్లను అందిస్తుండగా, ఈ ట్యాబ్ ధర డిస్కౌంట్ అనంతరం రూ.23,999గా ఉంది. అలాగే ఈ సేల్‌లో యాపిల్ టెన్త్ జనరేషన్ ఐప్యాడ్‌ను రూ.34,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఎ14 బయానిక్ చిప్సెట్, 10.9 ఇంచుల డిస్ప్లే, 256 జీబీ స్టోరేజ్, వైఫై 6, 12 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, టచ్ ఐడీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. యాపిల్‌కు చెందిన ఐప్యాడ్ ఎయిర్ 13 (ఎం2) ఈ సేల్‌లో డిస్కౌంట్ అనంతరం రూ.73,999 ధరకు లభిస్తోంది. దీంట్లో లిక్విడ్ రెటీనా డిస్ప్లే, 256 జీబీ స్టోరేజ్, 12 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, వైఫై 6ఇ, టచ్ ఐడీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 11 (ఎం2) ట్యాబ్‌ను ఈ సేల్‌లో డిస్కౌంట్ అనంతరం రూ.89,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో లిక్విడ్ రెటీనా డిస్ప్లే, 512 జీబీ స్టోరేజ్, 12 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, వైఫై 6ఇ, ఇసిమ్ సపోర్ట్, టచ్ ఐడీ వంటి ఫీచర్లను ఇస్తున్నారు. ఇక లెనోవోకు చెందిన ఐడియా ట్యాబ్ ప్రొ ట్యాబ్లెట్‌ను ఈ సేల్‌లో రూ.30,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో 12.7 ఇంచ్ 3కె డిస్ప్లే, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఏఐ యాప్స్, మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ఆక్టాకోర్ ప్రాసెసర్, క్వాడ్ జేబీఎల్ స్పీకర్స్, 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జర్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ ట్యాబ్‌లపై బ్యాంకు ఆఫర్లను కూడా పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ కార్డులపై రూ.5000 ఇన్స్టంట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపై రూ.1750, ఫెడరల్ బ్యాంకు కార్డులపై రూ.1750, వన్ కార్డ్ క్రెడిట్ కార్డులపై రూ.3500 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈఎంఐ విధానంలో కొన్నా డిస్కౌంట్‌ను ఇస్తారు. మరిన్ని వివరాలకు అమెజాన్ సైట్‌ను సందర్శించవచ్చు.