Amazon Mega Savings Days Sale | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో మరో కొత్త సేల్‌ను ప్రారంభించింది. మెగా సేవింగ్ డేస్ పేరిట ఓ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో పలు టాప్ కంపెనీలకు చెందిన టీవీలను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. సోనీ, శాంసంగ్, ఎల్జీ, షియోమీ, టీసీఎల్ కంపెనీలకు చెందిన టీవీలను డిస్కౌంట్ ధరలకే కొనవచ్చు. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లను రూ.8,999 ప్రారంభ ధరకు అందిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ వస్తువులను కొంటే రాయితీలు కూడా లభిస్తాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ఇస్తున్నారు. కొన్ని రకాల ఉత్పత్తులపై ఏకంగా 4 ఏళ్ల వరకు అదనపు వారంటీని కూడా అందిస్తున్నారు.
ఈ సేల్‌లో సోనీ కంపెనీకి చెందిన 55 ఇంచుల 4కె టీవీని రూ.54,990 ధరకు కొనవచ్చు. అలాగే 65 ఇంచుల టీవీ ధర రూ.71,990గా ఉంది. 43 ఇంచుల టీవీని రూ.41,990 ధరకు, 65 ఇంచుల 4కె మినీ ఎల్ఈడీ టీవీని రూ.1,52,990 ధరకు అందిస్తున్నారు. శాంసంగ్‌కు చెందిన 32 ఇంచుల హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీని రూ.11,990కే కొనవచ్చు, 55 ఇంచుల విజన్ ఏఐ 4కె స్మార్ట్ క్యూలెడ్ టీవీని రూ.49,990 ధరకు అందిస్తున్నారు. ఇక ఎల్జీ కంపెనీకి చెందిన 55 ఇంచుల 4కె టీవీ ధర రూ.40,990గా ఉంది. అలాగే 32 ఇంచుల టీవీని రూ.13,490కు, 43 ఇంచుల 4కె టీవీని రూ.30,990కి, 50 ఇంచుల 4కె టీవీని రూ.37,990 ధరకు, 55 ఇంచుల ఓలెడ్ 4కె స్మార్ట్ టీవీని రూ.1,14,990 ధరకు కొనవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా షియోమీ 43 ఇంచుల 4కె స్మార్ట్ ఎల్ఈడీ ఫైర్ టీవీని రూ.20,499కు కొనవచ్చు. అలాగే షియోమీ 55 ఇంచుల క్యూలెడ్ 4కె ఫైర్ టీవీని రూ.37,999కు అందిస్తున్నారు. టీసీఎల్ 55 ఇంచుల 4కె మినీ ఎల్ఈడీ టీవీ ధర రూ.40,990 ఉండగా, 55 ఇంచుల 4కె క్యూలెడ్ గూగుల్ టీవీ ధర రూ.40,990గా ఉంది. వు కంపెనీకి చెందిన 50 ఇంచుల 4కె క్యూలెడ్ స్మార్ట్ గూగుల్ టీవీ ధర రూ.30,990గా ఉంది. 55 ఇంచుల 4కె క్యూలెడ్ టీవీని రూ.33,990కి కొనవచ్చు. లుమియో కంపెనీకి చెందిన 43 ఇంచుల 4కె టీవీ ధర రూ.29,999గా ఉంది. 55 ఇంచుల 4కె టీవీ ధర రూ.59,999గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా హైసెన్స్, హయర్, ఏసర్, తోషిబా, వీడబ్ల్యూ, ఒనిడా, ను, కోడాక్ వంటి కంపెనీలకు చెందిన టీవీలను సైతం తగ్గింపు ధరలకు అందిస్తున్నారు.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులతో ఈ టీవీలను కొనుగోలు చేస్తే రూ.4500 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు కార్డులతో అయితే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులతో 10 శాతం, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్డులతో 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన అనేక టీవీ మోడల్స్‌పై ఏకంగా 65 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు. 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. పాత టీవీలను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.7వేల వరకు తగ్గింపు పొందవచ్చు. కూపన్లతో మరో రూ.5వేల వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. ఈ సేల్ ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగుతుందని అమెజాన్ తెలియజేసింది.