Amazon Mega Electronics Day Sale | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ పేరిట ఓ సేల్‌ను అమెజాన్ ప్రారంభించింది. ఇందులో పలు రకాల ఎలక్ట్రానిక్స్‌పై ఏకంగా 75 శాతం వరకు రాయితీలను అందిస్తున్నారు. ఈ సేల్‌లో హెడ్ ఫోన్స్, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఉత్పత్తులతోపాటు ప్రముఖ కంపెనీలైన డెల్, సోనీ, శాంసంగ్‌లకు చెందిన ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ స్థాయిలో రాయితీలను అందిస్తున్నారు. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో హెచ్‌పీ 15 విత్ ఏఎండీ రైజెన్ 3 7329యు ల్యాప్ టాప్‌ను రూ.29,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఏసర్ ఆస్పయిర్ లైట్ థిన్ అండ్ లైట్ ప్రీమియం ల్యాప్ టాప్‌ను రూ.33,490కే కొనవచ్చు.
ఈ సేల్‌లో డెల్ ఇన్స్పిరాన్ 3535 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్‌ను రూ.38,990కి అందిస్తున్నారు.అలాగే అసుస్ వివోబుక్ 15 ల్యాప్ టాప్‌ను రూ.50,990కి కొనవచ్చు. హెచ్‌పీ 15 ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.51,990గా ఉంది. లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్ ధర రూ.61,990 ఉండగా, అసుస్ టీయూఎఫ్ గేమింగ్ ఎ15 ల్యాప్ టాప్ ధర రూ.65,990గా ఉంది. లెనోవో యోగా స్లిమ్ 7 ల్యాప్ టాప్ ధర రూ.74,990గా ఉంది. డెల్ డి సిరీస్ 15 5530 ల్యాప్ టాప్‌ను రూ.74,990 ప్రారంభ ధరకు అందిస్తున్నారు. ఏసర్ నైట్రో వి16 ల్యాప్ టాప్ ధర రూ.76,990గా ఉంది. అసుస్ గేమింగ్ వి16 (2025) ల్యాప్ టాప్ ధర రూ.87,990 ఉండగా, ఎంఎస్ఐ సైబోర్గ్ 15 ఏఐ గేమింగ్ ల్యాప్ టాప్ ధర రూ.77,154గా ఉంది.
ఈ సేల్‌లో పలు కంపెనీలకు చెందిన హెడ్ ఫోన్స్‌పై కూడా ఆకట్టుకునే రాయితీలు, డీల్స్‌ను అందిస్తున్నారు. నాయిస్ బడ్స్ ఎన్1 ప్రొ ఇన్ ఇయర్ ట్రూలీ వైర్లెస్ ఇయర్‌బడ్స్ ధర రూ.1499గా ఉంది. బౌల్ట్ ముస్తాంగ్ టార్క్ వైర్లెస్ ఇన్ ఇయర్ ఇయర్‌బడ్స్ ధర రూ.1799 ఉండగా, జేబీఎల్ వైబ్ బీమ్ ఇయర్‌బడ్స్‌ను రూ.2199కు అందిస్తున్నారు. అలాగే స్కల్ క్యాండీ డైమ్ 3 ఇయర్‌బడ్స్ ధర రూ.2499 ఉండగా, జేబీఎల్ వేవ్ బడ్స్ 2 ఇయర్ బడ్స్ ధర రూ.2,999గా ఉంది. నాయిస్ మాస్టర్ బడ్స్ సౌండ్‌ను రూ.6,999కు, స్కల్ క్యాండీ ఐకాన్ ఏఎన్సీ బడ్స్‌ను రూ.7,999కు, మార్షల్ మేజర్ 4 ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్‌ను రూ.14,999కు అందిస్తున్నారు. మార్షల్ మేజర్ 5 ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్ ధర రూ.14,999గా ఉంది. బోస్ ఇయర్ బడ్స్‌ను రూ.13,489కు, సోనీ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్‌ను రూ.19,989కు కొనవచ్చు.
వన్ ప్లస్ ప్యాడ్ గో వైఫై ట్యాబ్‌ను ఈ సేల్‌లో రూ.17,999కు కొనవచ్చు. లెనోవో ట్యాబ్ ప్లస్ ను రూ.24,999కు, షియోమీ ప్యాడ్ 6ను రూ.24,999కి, రెడ్మీ ప్యాడ్ ప్రొ 5జి ట్యాబ్‌ను రూ.23,780కి కొనవచ్చు. షియోమీ ప్యాడ్ 7 ట్యాబ్ ధర రూ.27,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ ట్యాబ్‌ను రూ.28,499కి కొనవచ్చు. లెనోవో ఐడియా ట్యాబ్ ప్రొ ధర రూ.30,999గా ఉంది. ఈ సేల్‌లో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్‌లపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఫైర్ బోల్ట్, రెడ్మీ వాచ్, నాయిస్, అమేజ్‌ఫిట్, వన్ ప్లస్, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 వంటి వాచ్‌లపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఈ సేల్‌లో డిజిటల్ కెమెరాలను కూడా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై రూ.4500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. యెస్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ కార్డులపై రూ.1750 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను, కెనరా బ్యాంకు కార్డులపై రూ.1500, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డులపై రూ.3500 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.