Amazon Laptop Days Sale | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా ల్యాప్ టాప్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వినియోగదారులు కేవలం రూ.11,990 ప్రారంభ ధరకే ల్యాప్‌టాప్‌ను సొంతం చేసుకోవచ్చు. అలాగే హెచ్‌పీ, అసుస్, లెనోవో, డెల్, ఏసర్ వంటి కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్ మోడల్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నారు. హెచ్‌పీ 15ఎస్ ల్యాప్‌టాప్‌ను రూ.43,990కి సొంతం చేసుకోవచ్చు. అలాగే హెచ్‌పీ 15 ల్యాప్‌టాప్‌ను రూ.37,990కి కొనుగోలు చేయవచ్చు. ఏసర్ ఆస్పయిర్ లైట్ ల్యాప్‌టాప్ ధర రూ.34,490గా ఉంది. ఏసర్ ఆస్పయిర్ లైట్ ఇంటెల్ మోడల్ ధర రూ.49,990గా ఉంది.
అసుస్ వివోబుక్ గో 14 ల్యాప్‌టాప్‌ను రూ.29,990కి కొనుగోలు చేయవచ్చు. అసుస్ వివోబుక్ 15ను రూ.31,990కి కొనుగోలు చేయవచ్చు. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్‌ను రూ.49,990 ధరకు కొనవచ్చు. లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 1 ను రూ.36,990కి కొనుగోలు చేయవచ్చు. డెల్ విండోస్ 11 హోమ్ 3520 ల్యాప్‌టాప్ ధర రూ.33,990 ఉండగా, డెల్ ఇన్స్పిరాన్ 3530 ల్యాప్‌టాప్ ధర రూ.37,490గా ఉంది. ఈ సేల్‌లో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రొ ల్యాప్‌టాప్‌ను రూ.1,08,990కి కొనుగోలు చేయవచ్చు. అలాగే హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ ల్యాప్‌టాప్ ధర రూ.72,490గా ఉంది. హెచ్‌పీ 14 ఏఐ ల్యాప్ టాప్ ధర రూ.83,490 ఉండగా, అసుస్ వివోబుక్ 15 ల్యాప్‌టాప్ ప్రీమియం మోడల్ ధర రూ.63,990గా ఉంది.
అసుస్ వివోబుక్ 14 ఓలెడ్ మోడల్ ధర రూ.1,04,990 ఉండగా, లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 ప్రీమియం మోడల్ ధర రూ.64,490గా ఉంది. అలాగే ఏసర్ స్విఫ్ట్ గో 14 ల్యాప్‌టాప్ ధర రూ.92,990గా ఉంది. డెల్ ఇన్స్పిరాన్ 3530 ల్యాప్ టాప్‌ను రూ.55,990కి కొనుగోలు చేయవచ్చు. ప్రైమ్బుక్ ఎస్ 4జి 2024 మోడల్ ధర రూ.15,490 ఉండగా, జియోబుక్ 11 4జి ల్యాప్‌టాప్ ధర రూ.12,990గా ఉంది. ఏసర్ 11 ల్యాప్‌టాప్ మోడల్స్ రూ.17,990 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. డెల్ లాటిట్యూడ్ ఇ7470 ల్యాప్‌టాప్ ధర రూ.16,990గా ఉంది. అయితే అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి ఈ ల్యాప్‌టాప్‌ల ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు ఉంటాయని అమెజాన్ తెలియజేసింది.
ఈ ల్యాప్‌టాప్ లను కొనుగోలు చేసిన వారికి పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ కార్డులపై రూ.4500 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులు అయితే 7.5 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. జే అండ్ కే బ్యాంకు కార్డులతో 10 శాతం, ఫెడరల్ బ్యాంకు కార్డులతో 7.5 శాతం, హెచ్ఎస్బీసీ కార్డులతో 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే ఈఎంఐతో ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసినా రాయితీని పొందవచ్చు. హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.10వేల వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీనిపై 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.18వేల వరకు అదనపు బోనస్‌ను పొందవచ్చు. ఇక ఈ సేల్ ఏప్రిల్ 20వ తేదీ వరకు కొనసాగనుంది.