Best Laptops | ఇప్పుడంతా డిజిటల్ కాలం.. ఏ పని చేయాలన్నా స్మార్ట్ఫోన్లు.. టాబ్లెట్లు.. లాప్ టాప్‌లు అవసరం.. ఉన్నత విద్యాకోర్సులు చదివే విద్యార్థులు.. కార్పొరేట్ సంస్థల్లో పని చేసే ఎగ్జిక్యూటివ్‌లు.. నిత్యం లాప్టాప్లపైనే ఆధారపడుతుంటారు. అటువంటి వారి కోసం ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2023లో భాగంగా పలు రకాల డిస్కౌంట్లపై లాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ డిస్కౌంట్లతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ లేదా కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ నెల నాలుగో తేదీన మొదలైన డిస్కౌంట్ సేల్.. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు కొనసాగుతుంది. మీరు లాప్ టాప్ కొనుక్కోవాలనుకుంటున్నారా.. అయితే.. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్స్-2023 ఆఫర్ల మీద ఓ లుక్కేయండి..
మీరు రూ.40 వేల లోపు ధరకే లాప్ టాప్ కొనుక్కోవాలనుకుంటున్నారా.. లెనోవో తన ఐడియా పాడ్ స్లిమ్3` మోడల్ మీద భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది. ప్రస్తుతం మార్కెట్ ధర రూ.60,890. కానీ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ కింద భారీగా 46 శాతం డిస్కౌంట్ మీద అందుబాటులో ఉంది. అంటే ప్లాటినం గ్రే కలర్ లెనోవో ఐడియా పాడ్ స్లిమ్3 ప్లాట్‌ఫామ్ రూ.32,990లకే లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అదనంగా రూ.12,850 వరకు ధర తగ్గుతుంది. ఈ లాప్ టాప్ 15.6-అంగుళాల హెచ్ డీ యాంటీ గ్లేర్ డిస్ ప్లేతో వస్తున్నది. 11థ్ జెన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ కూడా ఉంది. ఈ లాప్ టాప్ 8జీబీ ఆఫ్ డీడీఆర్4 రామ్, 256 జీబీ ఆఫ్ ఎస్ఎస్డీ స్టోరేజీ కలిగి ఉంటుంది. 12 జీబీ రామ్ వరకు పొడిగించుకోవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఆరు గంటల వరకు బ్యాటరీ సపోర్ట్‌గా ఉంటుంది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ హానర్’కు చెందిన మ్యాజిక్ బుక్ 15 లాప్ టాప్ కంప్యూటర్ 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ యాంటీ-గ్లేర్ డిస్ ప్లేతో వస్తున్నది. దీని అసలు ధర రూ.55,999 కాగా, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో రూ.36,990లకు లభిస్తుంది. ఈ లాప్ టాప్ మీద 34 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.12,850 వరకు రాయితీ అందుకోవచ్చు. హానర్ మ్యాజిక్ 15 లాప్ టాప్ 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నది. ఏఎండీ రేజెన్ 5 5500 యూ ప్రాసెసర్‌తో వస్తున్నది.
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌పీ లాప్ టాప్ `హెచ్‌పీ 15ఎస్`.. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2023లో రూ.37,990లకే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.47,142. అదనంగా ఎక్చ్చేంజ్ ఆఫర్ కింద రూ.12,850 డిస్కౌంట్ అందుకోవచ్చు. 15.6-అంగుళాల ఫుల్ హెచ్ డీ యాంటీ గ్లేర్ డిస్ ప్లే, ఏఎండీ రేజెన్3 5300యూ ప్రాసెసర్, 8జీబీ ఆఫ్ డీడీఆర్4 రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. సింగిల్ చార్జింగ్ తర్వాత తొమ్మిది గంటల వరకు బ్యాటరీ సపోర్ట్ ఉంటది. 45 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది.
ప్రముఖ లాప్ టాప్, కంప్యూటర్ల తయారీ సంస్థ ఎసేర్ లాప్ టాప్ ఎక్స్ టెన్సా వాస్తవ ధర రూ.45,999. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2023లో రూ.33,990లకు లభిస్తుంది. 11థ్ జన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ తో వస్తున్నది. 8జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఎసెర్ ఎక్స్టెన్సా 15 లాప్ టాప్.. 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తున్నది.
అసుస్ వివోబుక్-14 లాప్ టాప్ మీద భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2023లో 39 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. దీని వాస్తవ ధర రూ.70,990. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో రూ.42,990లకే లభిస్తుంది. అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.13,850 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. 14-అంగుళాల ఫుల్ హెచ్ డీ యాంటీ గ్లేర్ స్క్రీన్, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నది.