Amazon Great Freedom Festival 2025 | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ 2025 పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోపాటు పలు ఇతర ఉత్పత్తులపై ఆకట్టుకునే డీల్స్, రాయితీలను అందిస్తున్నారు. ఈ సేల్‌లో మొబైల్స్, యాక్ససరీలపై 40 శాతం తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్‌ను రూ.79,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయచ్చు. గెలాక్సీ ఎం36 5జి స్మార్ట్ ఫోన్‌ను రూ.15,999కు అందిస్తున్నారు. యాపిల్ ఐఫోన్ 15కు చెందిన 128జీబీ మోడల్ ధర రూ.58వేలుగా ఉంది. ఐక్యూ జడ్10ఆర్ 5జి స్మార్ట్ ఫోన్‌ను రూ.17,499కు, ఐక్యూ నియో 10ఆర్ 5జి స్మార్ట్ ఫోన్‌ను రూ.22,999కు కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో రెడ్మీ 13 5జి స్మార్ట్ ఫోన్‌ను రూ.11,699కు కొనవచ్చు. అలాగే రియల్‌మి నార్జో 80 లైట్ 5జి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్‌ను రూ.10,499కు, లావా బ్లేజ్ డ్రాగన్ 5జి ఫోన్‌ను రూ.8,999కు కొనవచ్చు. వన్‌ప్లస్ 13కు చెందిన అన్ని వేరియెంట్లపై ఆగస్టు 31వ తేదీ వరకు తాత్కాలికంగా రూ.7వేల తగ్గింపు ధరను అందిస్తున్నారు. దీనిపై 9 నెలల నో కాస్ట్ ఈఎంఐ కూడా లభిస్తుంది. వన్‌ప్లస్ 13ఎస్‌కు చెందిన అన్ని వేరియెంట్లపై రూ.5వేల బ్యాంక్ డిస్కౌంట్‌ను, రూ.3వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ 13ఆర్కు చెందిన పలు వేరియెంట్లపై రూ.2వేల నుంచి రూ.5వేల వరకు డిస్కౌంట్లను అందిస్తున్నారు. వన్ ప్లస్ నార్డ్ 5 ఫోన్లపై రూ.2250 డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్ ప్లస్ నార్డ్ సీఈ5 ఫోన్‌పై రూ.2250, వన్ ప్లస్ ప్యాడ్ లైట్ ట్యాబ్‌పై రూ.2వేలు, వన్ ప్లస్ ప్యాడ్ 2పై రూ.2వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్‌కు చెంందిన ఇయర్‌బడ్స్‌పై కూడా రాయితీలను అందిస్తున్నారు. రూ.500 నుంచి రూ.2వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సేల్‌లో లెనోవో థింక్ ప్యాడ్ 16 ల్యాప్‌టాప్‌ను రూ.46,990 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే అసుస్ వివోబుక్ 15ను రూ.33,990కు, హెచ్‌పీ విక్టస్ ల్యాప్‌టాప్‌ను రూ.81,990కి, ఏసర్ ఏఎల్జీని రూ.69,990కి, అసుస్ టీయూఎఫ్ గేమింగ్ ఎ15 ను రూ.82,990కి, లెనోవో ఎల్వోక్యూ ల్యాప్‌టాప్‌ను రూ.61,990 ధరకు కొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్‌కు చెందిన అలెక్సా, ఫైర్ టీవీ డివైస్‌లపై 30 శాతం వరకు తగ్గింపు ధరను అందిస్తున్నారు. పలు ఆడియో ఉత్పత్తులను కూడా తగ్గింపు ధరలకే పొందవచ్చు. మరిన్ని వివరాలకు అమెజాన్‌లో అందుబాటులో ఉన్న డీల్స్ పేజ్‌ను సందర్శించవచ్చు.
ఇక ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్లపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. రూ.5250 గరిష్ట డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అమెజాన్ పే యూపీఐ ట్రాన్సాక్షన్లపై 5 శాతం అష్యూర్డ్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే పలు ఇతర బ్యాంకులకు చెందిన కార్డులపై కూడా రాయితీలను అందిస్తున్నారు. ఇక ఈ సేల్ ముగింపు తేదీని ప్రకటించలేదు. కానీ ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.