Amazon Gaming Fest Sale | ల్యాప్‌టాప్‌లను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే అమెజాన్ ఓ సేల్‌ను లేటెస్ట్గా ప్రారంభించింది. అమెజాన్ గేమింగ్ ఫెస్ట్ పేరిట ప్రారంభం అయిన ఈ సేల్‌లో భాగంగా పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉత్పత్తులపై భారీ రాయితీలను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా అసుస్ ఆర్వోజీ, హెచ్‌పీ, డెల్ వంటి కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లను తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు. గేమింగ్ గ్యాడ్జెట్లపై ఏకంగా 70 శాతం వరకు రాయితీని అందిస్తున్నారు. ఈ సేల్ ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా అసుస్ వివోబుక్ 16ఎక్స్ క్రియేటర్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను రూ.56,990 ధరకే కొనుగోలు చేయవచ్చు. అలాగే హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ రూ.61,990 ప్రారంభ ధరకు లభిస్తుంది.
అసుస్ టీయూఎఫ్ గేమింగ్ ఎ15 ల్యాప్‌టాప్‌ను రూ.64,990 ధరకు, లెనోవో ఎల్వోక్యూ 2024 ల్యాప్‌టాప్‌ను రూ.65,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే డెల్ జి15-5530 ల్యాప్‌టాప్ ధర రూ.74,990 ఉండగా, అసుస్ గేమింగ్ వి16 ల్యాప్ టాప్ ధర రూ.89,990గా ఉంది. హెచ్‌పీ ఓమెన్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను రూ.1,02,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. అసుస్ ఆర్వోజీ స్ట్రిక్స్ జి16 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను రూ.1,29,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్, టాప్ ఎండ్ ల్యాప్‌టాప్‌లు అన్నింటిపై కూడా కళ్లు చెదిరే డీల్స్‌ను, ఆకట్టుకునే రాయితీలను అందిస్తున్నారు.
ఈ సేల్‌లో భాగంగా పలు గేమింగ్ యాక్ససరీలపై కూడా రాయితీలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా జీబ్రానిక్స్ బ్లిట్జ్ సి డాల్బీ అట్మోస్ గేమింగ్ ఓవర్ ఇయర్ హెడ్‌ఫోన్‌ను రూ.1299కు కొనుగోలు చేయవచ్చు. జీబ్రానిక్స్ మాక్స్ లింక్ వైర్లెస్ గేమ్‌ప్యాడ్ ధర రూ.1499గా ఉంది. లాజిటెక్ జి102 యూఎస్బీ లైట్ సింక్ గేమింగ్ మౌస్‌ను రూ.1295కు కొనవచ్చు. యాంట్ ఇస్పోర్ట్స్ ఎంకే4500 ప్రొ టీకేఎల్ వైర్లెస్ బ్లూటూత్ మెకానికల్ కీబోర్డు ధర రూ.2199గా ఉంది. జీబ్రానిక్స్ హవోక్ ప్రీమియం గేమింగ్ ఓవర్ ఇయర్ హెడ్‌ఫోన్స్‌ను రూ.1599కు కొనవచ్చు. కాస్మిక్ బైట్ ఆర్స్ వైర్లెస్ కంట్రోలర్‌ను రూ.1499కు, రేజర్ బ్లాక్ షార్క్ వి2 ఎక్స్ వైర్డ్ గేమింగ్ ఆన్ ఇయర్ హెడ్‌సెట్‌ను రూ.3599కు కొనుగోలు చేయవచ్చు.
వ్యూసోనిక్ 27 ఇంచుల గేమింగ్ మానిటర్ ధర రూ.9,999గా ఉంది. ఎంఎస్ఐకి చెందిన 23.6 ఇంచుల మానిటర్‌ను రూ.9,999 ధరకు కొనవచ్చు. ఎల్జీకి చెందిన 27 ఇంచుల గేమింగ్ మానిటర్ ధర రూ.13,299గా ఉంది. వ్యూ సోనిక్ 2కె గేమింగ్ మానిటర్ ధర రూ.16,499గా ఉంది. వ్యూసోనిక్ ఓమ్ని 32 ఇంచుల మానిటర్‌ను రూ.22,599కు కొనుగోలు చేయవచ్చు. జీబ్రానిక్స్ 34 ఇంచుల మానిటర్ ధర రూ.26,999గా ఉంది. ఇక మదర్ బోర్డులపై 71 శాతం, గేమింగ్ రూటర్స్‌పై 63 శాతం, గేమింగ్ కీబోర్డ్స్, మౌస్‌పై 82 శాతం, గేమింగ్ హెడ్ ఫోన్స్‌పై 67 శాతం, గ్రాఫిక్ కార్డులపై 80 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన కార్డులను ఉపయోగిస్తే రూ.7500 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంకు కార్డులతో రూ.2000, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులతో రూ.1750, ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో రూ.1750, వన్ కార్డ్ క్రెడిట్ కార్డులతో రూ.3500 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు.