న్యూఢిల్లీ : ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ అమేజ్‌ఫిట్ మరో ఫిట్నెస్ బ్యాండ్‌ను మార్కెట్లో లాంఛ్ చేయనుంది. అమేజ్‌ఫిట్ బ్యాండ్ 7ను నవంబర్ 8న కంపెనీ లాంఛ్ చేయనుంది. బ్యాండ్ 7 18 రోజుల బ్యాటరీ లైఫ్ కలిగిఉంటుందని అమేజ్‌ఫిట్ పేర్కొంది. 120 స్పోర్ట్స్ మోడ్స్, వైడ్ డిస్ప్లేతో బ్యాండ్ 7 కస్టమర్ల ముందుకు రానుంది.
బ్యాండ్ 7కు అమేజ్‌ఫిట్ హానర్ బ్యాండ్ 6 స్టైల్ డిస్ప్లేను ఎంచుకుంది. న్యూ బ్యాండ్ 7 ఈనెల 8 నుంచి రూ 2999కు కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని అమేజ్‌ఫిట్ ప్రకటించింది. లాంఛ్ తర్వాత డివైజ్ ధరను రూ 3499కి పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ బ్యాండ్ అమెజాన్‌తో పాటు అమేజ్‌ఫిట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
అమేజ్‌ఫిట్ బ్యాండ్ 7 1.47 ఇంచ్ హెచ్డీ అమోల్డ్ డిస్ప్లేతో పాటు 28గ్రాముల బరువుతో తేలికపాటి డివైజ్‌గా ముందుకు రానుంది. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉండటంతో స్విమ్మింగ్, బాతింగ్ సమయంలోనూ బ్యాండ్‌ను ధరించవచ్చు. అమేజ్‌ఫిట్ బ్యాండ్ 7 ఎస్ఓపీ, హార్ట్‌రేట్, స్ట్రెస్ లెవెల్స్ ట్రాకింగ్ వంటి పలు హెల్త్ ఫీచర్లను కలిగిఉంది.