విరాట్‌కర్ణ హీరోగా నటిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకుడు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్ని పరిచయం చేస్తున్నారు. శుక్రవారం ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి పాత్రను పోషించిన బాలీవుడ్ నటుడు రిషబ్ సాహ్నీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ ‘ఫైటర్’ సినిమాతో రిషబ్ సాహ్నీ పాపులర్ అయ్యాడు.
1750 బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో భారత్‌లో సుల్తాన్ అబ్దాలి చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపీడి, అపార సంపద కోసం అతను చేసిన నేరాల్ని చూపించబోతున్నారు. హిమాలయాల్లో దాగివున్న మార్మిక శక్తులు కలిగిన నాగబంధాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తిగా సుల్తాన్ అబ్దాలి పాత్ర సాగుతుందని మేకర్స్ తెలిపారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: అభే, జునైద్ కుమార్, నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్ నామా.