Alcatel V3 Smart Phones | ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందించేందుకు ప్రస్తుతం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఒక ఫోన్‌ను మించి మరొక ఫోన్‌ను వారు తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తున్నారు. అందులో భాగంగానే అల్కాటెల్ సైతం ఏకంగా 3 బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అల్కాటెల్ వి3 అల్ట్రా 5జి, వి3 ప్రొ 5జి, వి3 క్లాసిక్ 5జి పేరిట ఈ ఫోన్లను లాంచ్ చేశారు. వీటిల్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ధరలు కూడా అందుబాటులోనే ఉండడం విశేషం.
అల్కాటెల్ వి3 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్లో 6.8 ఇంచుల డిస్ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 108, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జి, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ, 5010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
అల్కాటెల్ వి3 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచుల డిస్ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 15, 50, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జి, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను అందిస్తున్నారు.
అల్కాటెల్ వి3 క్లాసిక్ 5జి స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచుల డిస్ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 15 ఓఎస్, 50, 0.08 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జి, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను అందిస్తున్నారు.
అల్కాటెల్ వి3 అల్ట్రా 5జి స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999గా ఉంది. అల్కాటెల్ వి3 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియెంట్ ధర రూ.17,999గా ఉంది. అల్కాటెల్ వి3 క్లాసిక్ 5జి ఫోన్ 4జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.12,999 ఉండగా, 6జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.14,999గా ఉంది. జూన్2 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు అన్ని రిటెయిల్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్లను విక్రయించనున్నారు. ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులతో ఈ ఫోన్లపై గరిష్టంగా రూ.2000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే అదనపు బోనస్ లభిస్తుంది. 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు.