Acer Nitro Lite 16 | బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఏసర్ సంస్థ ఓ నూతన ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఏసర్ నైట్రో లైట్ 16 పేరిట ఈ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేశారు. లైట్ సిరీస్‌లో వచ్చిన 16 ఇంచుల ల్యాప్‌టాప్ ఇదే కావడం విశేషం. ఈ ల్యాప్‌టాప్‌ను గేమర్స్, విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్ల కోసం రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. ఈ ల్యాప్‌టాప్ పోర్టబుల్‌గా ఉండడమే కాదు, అద్భుతమైన ప్రదర్శనను ఇస్తుందని కంపెనీ తెలియజేసింది. నైట్రో లైట్ 16 ల్యాప్‌టాప్‌లో 16 ఇంచుల ఐపీఎస్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు.
ఈ ల్యాప్‌టాప్ ద్వారా 1920*1200 రిజల్యూషన్ లభిస్తుంది. 180 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌కు బిల్టిన్ వెబ్ క్యామ్ లభిస్తుంది. దీనికి ప్రైవసీ షటర్‌ను కూడా అందిస్తున్నారు. అవసరం లేకపోతే కెమెరాను ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ కేవలం 1.95 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. 22.9 ఎంఎం మందాన్ని కలిగి ఉంటుంది. 16 ఇంచుల ల్యాప్ టాప్లలో ఈ ల్యాప్ టాప్ అద్భుతమైన ప్రదర్శనను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 53 వాట్ అవర్ బ్యాటరీ ఉంది. 100 వాట్ల యూఎస్బీ టైప్ సి చార్జర్ లభిస్తుంది. అందువల్ల ల్యాప్ టాప్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ ల్యాప్ టాప్‌లో ఇంటెల్ థ్రెడ్ డైరెక్టర్ టెక్నాలజీ లభిస్తుంది. అందువల్ల ఉత్తమ ప్రదర్శనను ఇస్తుందని చెప్పవచ్చు. దీంట్లో ఇంటెల్‌కు చెందిన 13వ జనరేషన్ కోర్ ఐ7-13620హెచ్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఆర్టీఎక్స్ 4050 గ్రాఫిక్స్ లభిస్తున్నాయి. 24జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. 1టీబీ ఎస్ఎస్డీని సైతం పొందవచ్చు. తెలుపు రంగు బ్యాక్ లిట్ కీబోర్డు, కో పైలట్ కీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. దీని వల్ల ఏఐ టూల్స్‌ను వేగంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వైఫై 6 కి సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. బ్లూటూత్ 5.0 కూడా ఉంది. గిగాబిట్ ఈథర్నెట్ పోర్టును ఏర్పాటు చేశారు. హెచ్డీఎంఐ 2.1, యూఎస్బీ టైప్ సి, యూఎస్బీ 3.2 జెన్ 2 పోర్టులను ఏర్పాటు చేశారు.
ఈ ల్యాప్ టాప్‌ను ఇంటెల్ కోర్ ఐ5-13420హెచ్ వేరియెంట్లో కూడా లాంచ్ చేశారు. ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్స్ ఆప్షన్ కూడా లభిస్తుంది. 16జీబీ నుంచి ర్యామ్ ప్రారంభం అవుతుంది. కావాలంటే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 512జీబీ ఎస్ఎస్డీ కనీసం లభిస్తుంది. 1టీబీ వరకు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌పై 1 ఏడాది పాటు వారంటీని అందిస్తున్నారు. ఏసర్ నైట్రో లైట్ 6 ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.69,999 ఉండగా దీన్ని ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తోపాటు ఏసర్ ఆన్లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ కొనుగోలు చేయవచ్చు.