Acer Aspire Go 14 | బడ్జెట్ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన ల్యాప్‌టాప్‌ను కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఏసర్ సంస్థ ఓ నూతన ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఏసర్ ఆస్పయిర్ గో 14 పేరిట లాంచ్ అయిన ఈ ల్యాప్‌టాప్‌లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఇందులో 14 ఇంచుల ఐపీఎస్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్ కేవలం 1.5 కిలోల బరువు మాత్రమే ఉండి అత్యంత పలుచని డిజైన్ ను కలిగి ఉంది. కేవలం 17.5 ఎంఎం మాత్రమే మందాన్ని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌కు ప్రీమియం ఏ అండ్ డీ అల్యూమినియం మెటల్ కవర్‌ను అందిస్తున్నారు.
ఈ ల్యాప్‌టాప్‌లో 32జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. 1టీబీ వరకు ఎస్ఎస్డీని వాడుకోవచ్చు. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 హెచ్ సిరీస్‌కు చెందిన ప్రాసెసర్ లభిస్తుంది. అందువల్ల తేలికపాటి ఎడిటింగ్, డాక్యుమెంట్ల క్రియేషన్, మల్టీ టాస్క్‌లకు ఈ ల్యాప్‌టాప్ చక్కగా పనిచేస్తుంది. ఇందులో వైఫై 6ని అందిస్తున్నారు. బ్లూటూత్ 5.2 కూడా ఉంది. హెచ్డీ వెబ్ క్యామ్‌ను ఏర్పాటు చేశారు. యూఎస్బీ టైప్ ఎ పోర్టులు 2, యూఎస్బీ టైప్ సి పోర్టులు 2 ఉన్నాయి. డిస్ప్లే పోర్టును కూడా అందిస్తున్నారు. ఈథర్నెట్ పోర్టు కూడా ఉంది.
ఈ ల్యాప్‌టాప్‌తోపాటు 65 వాట్ల యూఎస్బీ టైప్ సి చార్జర్‌ను ఇస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌లో 55 వాట్ అవర్ కెపాసిటీ కలిగిన 3 సెల్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్‌కు గాను డెడికేటెడ్ కో పైలట్ కీ ని అందిస్తున్నారు. దీని సహాయంతో మైక్రోసాఫ్ట్ ఏఐ అసిస్టెంట్‌ను చాలా సులభంగా వాడుకోవచ్చు. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ల్యాప్ టాప్‌లో లభిస్తుంది. ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌ను ఇందులో అందిస్తున్నారు. ఇంటెల్ ఏఐ బూస్ట్ ఎన్పీయూ ఉంది. దీని సహాయంతో ఏఐ ఆధారిత పనులను మరింత సులభంగా చేసుకోవచ్చు.
ఏసర్ ఆస్పయిర్ గో 14 ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.59,999గా ఉంది. దీన్ని ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తోపాటు ఏసర్ ఆన్లైన్ స్టోర్, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు, తేలికపాటి ఎడిటింగ్ పనులు చేసేవారికి ఈ ల్యాప్ టాప్ ఉపయోగంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.