బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Aug 20, 2020 , 23:52:02

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 276 కరోనా కేసులు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 276 కరోనా కేసులు

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలో కొత్తగా మరో 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాం రాథోడ్‌ గురువారం తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డిలో 10, పటాన్‌చెరు 6, బీరంగూడ 6, సదాశివపేట 5, ఇస్నాపూర్‌ 3, ఇంద్రకరణ్‌ 2, పటేల్‌గూడ 2, పోచారంలో 2 కేసులు నమోదు కాగా, జహీరాబాద్‌, ఆర్‌సీపురం, అమీన్‌పూర్‌, హత్నూర, కొల్కూర్‌, దామర్‌గిద్ద, కొన్యాల్‌, చిట్కుల్‌, కందిల్లో ఒక్కో కేసు నమోదైనట్లు డీఎంహెచ్‌వో వెల్లడించారు.  ఇందులో 43 మంది హోం క్వారంటైన్‌, ఇద్దరు ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

జిల్లాలో ఆర్‌టీ పీసీఆర్‌ నమూనాల సేకరణ..

జిల్లా దవాఖానలో గురువారం 175 మంది వద్ద నుంచి ఆర్‌టీపీసీఆర్‌ నమూనాలు సేకరించినట్టు జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి తెలిపారు. జిల్లాలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు 629 మందికి చేశామని, మొబైల్‌ వ్యాన్‌ ద్వారా 144 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారులు తెలిపారు.

మెదక్‌ జిల్లాలో 57 కేసులు

మెదక్‌: మెదక్‌ జిల్లాలో గురువారం 57 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 777 కరోనా కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఇందులో 471 మంది హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతుండగా, 264 మంది కరోనా చికిత్సలు చేయించుకొని కోలుకున్నారని పేర్కొన్నారు. మరో 23 మంది ఆయా దవాఖానల్లో చికిత్సలు పొందుతున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా గురువారం రోజు అల్లాదుర్గంలో ఒకరు, చేగుంటలో 8 మంది, కొల్చారంలో ముగ్గురు, మెదక్‌లో ఆరుగురు, నర్సాపూర్‌లో ఐదుగురు, పాపన్నపేటలో ఒకరు, రామాయంపేటలో 12 మంది, రేగోడ్‌లో ఒకరు, పెద్దశంకరంపేటలో 9 మంది, చిన్నశంకరంపేటలో ఒకరు, శివ్వంపేటలో ఒకరు, తూప్రాన్‌లో ఒకరికి కరోనా నిర్ధారణ అయిందని తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో 174 కేసులు 

సిద్దిపేట కలెక్టరేట్‌: జిల్లా వ్యాప్తంగా గురువారం 174 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మండలాల వారీగా బెజ్జంకిలో 2, చేర్యాలలో 5, చిన్నకోడూరులో 5, దౌల్తాబాద్‌లో 2, దుబ్బాకలో 13, గజ్వేల్‌లో 24, హుస్నాబాద్‌లో 7, జగదేవ్‌పూర్‌లో 1, కోహెడలో 2, కొండపాకలో 6, మద్దూరులో 2, మర్కూక్‌లో 3, మిరుదొడ్డిలో 2, ములుగులో 2, నంగునూరులో 1, రాయిపోల్‌లో 5, సిద్దిపేట రూరల్‌లో 3, సిద్దిపేట అర్బన్‌లో 84, తొగుటలో 2, వర్గల్‌లో 3 మొత్తం 174 కేసులు నమోదయ్యాయి. 


logo