Srikakulam Sherlock Holmes | వెన్నెల కిశోర్ అంటేనే సపరేట్ కామెడీ. ఆయన కామెడీ టైమింగ్‌ను చాలామంది ఇష్టపడుతుంటారు. అలాంటి వెన్నెల కిశోర్ హీరోగా మారి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమాతో వచ్చాడు. రైటర్ మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మిస్టరీ కామెడీ చిత్రంతో వెన్నెల కిశోర్ మెప్పించాడా? లేదా? తెలుసుకుందాం..
తారాగణం :
ప్రధాన నటీనటులు: వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల, రవి; దర్శకుడు: రైటర్ మోహన్; నిర్మాత: రమణారెడ్డి
కథ-స్క్రీన్‌ప్లే
శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ అనేది మర్డర్ మిస్టరీ చుట్టూ సాగే డిటెక్టివ్ స్టోరీ. కథకు తగ్గట్టే ఇందులో అనేక ట్విస్టులు, మలుపులు ఉన్నాయి. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. నేరస్తుడు ఎవరనేది చివరి వరకు కూడా సగటు ప్రేక్షకులు ఊహించలేరు. డిటెక్టివ్ కథలు అంటే సాధారణంగా మిస్టరీల చుట్టూనే సాగుతూ ఉంటాయి. అయితే ఈ సినిమాలో మిస్టరీతో పాటు కుటుంబ విలువలు, లవ్ స్టోరీని కూడా చక్కగా చెప్పారు.
సాంకేతికతంగా..
సాధారణంగా డిటెక్టివ్ కథలు అంటే మిస్టరీల చుట్టూనే తిరుగుతాయి. కానీ డైరెక్టర్ మోహన్ ఈ చిత్రాన్ని డిటెక్టివ్ కథగా మాత్రమే చూపించకుండా మానవ సంబంధాలను లోతుగా చూపించే ప్రయత్నం చేశారు. కుటుంబ విలువలు, లవ్ స్టోరీలను కూడా బ్యాలెన్సింగ్‌గా చూపించారు. కథలోని భావోద్వేగాలను, మానవ సంబంధాలను, ప్రేమ, విశ్వాసం, నిజాయితీ లాంటి అంశాలను అద్భుతంగా వివరించారు. అయితే కామెడీ మూవీని ఎంజాయ్ చేద్దామని వచ్చే ప్రేక్షకులకు మాత్రం ఆ భావోద్వేగ సన్నివేశాలు బోరింగ్‌గా, సాగదీతగా అనిపిస్తాయి. పాటలు కూడా కథను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఉన్నాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.
ఎవరెలా చేశారంటే..
వెన్నెల కిశోర్ డిటెక్టివ్ పాత్రలో ఒదిగిపోయారు. ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్రలోని తెలివితేటలు, భావోద్వేగాలు.. ఈ రెండూ కూడా ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. అనన్య నాగళ్ల తన పరిధి మేరకు ఆకట్టుకుంటుంది. రవి కూడా ఫర్వాలేదనిపించాడు.
బలాలు
+ గూఢచారి కథ
+ వెన్నెల కిశోర్ కామెడీ
బలహీనతలు
– భావోద్వేగ సన్నివేశాలు
రేటింగ్ : 2.5/5
చివరగా.. మిస్టరీ, హాస్యం కలగలిపిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్