SPY Movie Review | స్పై మిస్సైల్ మిస్‌ఫైర్
SPY Movie Review | నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదిస్తున్న అంశంతో ఈ కథను తయారు చేశామనే భావన కలిగేలా ఈ చిత్ర టీజర్‌ను, ట్రైలర్‌ను కట్ చేసింది చిత్రబృందం. అందరిలోనూ ఈ అంశమే ఆసక్తిని పెంచింది.
SPY Movie Review | నటీనటులు: నిఖిల్, ఐశ్వర్య మీనన్, మకరంద్ దేశ్ పాండే, జీసుసేన్ గుప్తా, అభినవ్ గోమటం,ఆర్యన్ రాజేష్ నితిన్ మెహ్తా, రానా (అతిథి పాత్రలో) తదితరులు ; సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్; సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు ; నిర్మాత: కె.రాజశేఖర్ రెడ్డి; దర్శకత్వం: గ్యారీ బీహెచ్
కథలో కంటెంట్ ఉండటం దానితోడు కృష్ణ తత్వం అనే దైవత్వం అనే అంశం ఉండటం వల్ల నిఖిల్ నటించిన కార్తికేయ-2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు చేరువైంది. దీంతో నిఖిల్ పాన్ ఇండియా స్థాయి కథల వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. ఆ స్థాయి కథ అనుకొని చేసిన చిత్రమే స్పై. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిస్తూ గూఢచారి కథతో ఈ సినిమాను రూపొందించామనే విధంగా ట్రైలర్‌ను కట్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేలా ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం ఫలించిందా అసలు ‘స్పై’ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కథ
జైవర్ధన్ (నిఖిల్) రా ఏజెంట్. ఇండియాపై దాడి చేసే ప్రయత్నాల్లో ఉన్న ఉగ్రవాది ఖదీర్ ఖాన్‌ను చంపేశామని భావించిన ఇండియన్ ‘స్పై’ బృందానికి అతడు బతికే ఉన్నాడని తెలుస్తుంది. తనను చంపాలని చూసిన ఇండియాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఖదీర్ ఖాన్ మళ్లీ ఇండియాపై న్యూక్లియర్ బాంబు దాడికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఖదీర్ కోసం ప్రత్యేకమైన మిషన్‌తో జై రంగంలోకి దిగుతాడు. మరి ఖదీర్ దాడులను జై ఆపాడా? అసలు ఈ కథకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి ఉన్న సంబంధమేమిటి అనేది మిగతా కథ
విశ్లేషణ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదిస్తున్న అంశంతో ఈ కథను తయారు చేశామనే భావన కలిగేలా ఈ చిత్ర టీజర్‌ను, ట్రైలర్‌ను కట్ చేసింది చిత్రబృందం. అందరిలోనూ ఈ అంశమే ఆసక్తిని పెంచింది. కానీ సినిమా మాత్రం పూర్తిస్థాయిలో నిరాశపరిచింది. ఇలాంటి ‘స్పై’ కథలకు కథనంలో ఉత్కంఠ, ఆసక్తిని పెంచే అంశాలు, ట్విస్ట్‌లు ఉంటేనే ప్రేక్షకులు కథతో ట్రావెల్ అవుతారు. అసలు సినిమా మొత్తంలో కూడా ఎక్కడ కనీసం ఒక్క సన్నివేశం కూడా ఇంట్రెస్ట్‌ను కలిగించలేదు. నాలుగైదు హాలీవుడ్ సినిమాలు చూసి కొన్ని సన్నివేశాలు రాసుకున్న ఫీలింగ్‌ను కలిగించింది. ప్రథమార్థం ఎంతో బలహీనంగా ఉందో.. ద్వితీయార్థం కూడా అంతకంటే పేలవమైన సన్నివేశాలలో ముగిసింది. నేతాజీ చంద్రబోస్ మరణం చుట్టూ ఉండే రహస్యం ఏమిటి అనే ప్రస్తావన వుంటుంది. కానీ అందుకు సంబంధించిన ఒక్క ఆసక్తికరమైన సన్నివేశం సినిమాలో వుండదు. కేవలం ప్రారంభ వసూళ్లు వచ్చేందుకు చిత్ర బృందం చేసిన పబ్లిసిటి జిమ్మిక్కు లా అనిపించింది. రచన, దర్శకత్వం ఈ చిత్రానికి ప్రధానమైన బలహీనత, నిర్మాణ విలువలు కూడా గొప్పగా అనిపించలేదు. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ‘స్పై’ మిస్‌ఫైర్ అయ్యింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ సినిమాను నిఖిల్ ఎంచుకోవడమే నేల విడిచి సాము చేసినట్లుగా అనిపించింది. ‘కార్తికేయ-2’ చిత్రంలోని కంటెంట్‌కు తోడుగా కృష్ణతత్వం ప్రేక్షకులకు నచ్చడంతో అది పాన్ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. అంతేతప్ప ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమనే విషయాన్ని ఇటీవల రిలీజైన చాలా సినిమాలు నిరూపించాయి. ఈ సినిమా కూడా ఆ కోవలోకే చెందుతుంది. సినిమాలోని ఏ పాత్ర కూడా ఆకట్టుకోకపోవడంతో ఏ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. సాంకేతిక విభాగంలో కెమెరా, సంగీతం ఫర్వాలేదనిపించాయి. ఈ చిత్రంలో గ్యారీ బీహెచ్ దర్శకుడిగా కంటే ఎడిటర్‌గానే ఎక్కువ మార్కులు వేయవచ్చు. ఎందుకంటే దర్శకుడిగా తన బలహీనతలను ఎడిటర్‌గా కవర్ చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు సినిమాను రెండు గంటల 15 నిమిషాల నిడివితో ముగించి ప్రేక్షకుల పాలిట బెస్ట్ ఎడిటర్ అయ్యాడు.
బలాలు: ఏమీ లేవు
బలహీనతలు: కథ, కథనం, సన్నివేశాలు, భావోద్వేగాలు
రేటింగ్: 1.75/5
Read Today's Latest Reviews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

