బుధవారం 30 సెప్టెంబర్ 2020
Realestate - Sep 05, 2020 , 03:43:41

నట్టింట్లో నయగారా

నట్టింట్లో నయగారా

జలపాతాలను చూడాలంటే ఎక్కడెక్కడికో వెళ్లాలి. అయితే.. ఆ జలపాతాలను ఇంటి ఆవరణలోకే తీసుకొచ్చారు ఆర్కిటెక్కులు. నట్టింట్లోనూ వాటర్‌ ఫౌంటెయిన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కృత్రిమ జలపాతాలను పెట్టుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. అయితే వీటిని ఎక్కడెక్కడ ఎలా పెట్టుకోవాలో చూడండి..

  • ప్లాస్టిక్‌, మట్టి, రాతితో చేసిన ఫౌంటెయిన్‌లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు దొరుకుతున్నాయి. అయితే మనం పెట్టాలనుకునే గది, ప్రదేశాన్ని బట్టి దీని ఎంపిక ఉండాలి. 
  • అతిథులకు చల్లగా స్వాగతం పలికేందుకు గెస్ట్‌ రూమ్‌లో కానీ, హాల్‌లో కానీ దృశ్య ప్రధాన జలపాతాలు బాగుంటాయి. 
  • ప్రవేశద్వారం వద్ద విగ్రహాల రూపంలో ఉండేవి కనువిందు చేస్తాయి.  
  • లివింగ్‌ రూమ్‌లో ఈ కృత్రిమ జలపాతాన్ని పెట్టాలనుకుంటున్నారా? అయితే పువ్వులు, మొక్కలు ఉన్నవి ఎంచుకోండి.
  • పడక గదిలో ఉత్సాహం, మానసిక ప్రశాంతతను కలిగించేలా సూర్యోదయం, చంద్రోదయం, కొలనులు.. ఇలా దృశ్యప్రధాన జలపాతాలు బాగా సూటవుతాయి. 
  • పిల్లలు చదువుకునే గదిలో టేబుల్‌ టాప్‌ లైటింగ్‌తో వచ్చే ఫౌంటెయిన్‌లు బాగుంటాయి. ప్రకృతిని ప్రతిబింబించే ఈ జలపాతాల వల్ల పిల్లలు చదువు మీద కూడా ధ్యాస పెడుతారు. 


logo