రంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అధికారులు భూ ముల సేకరణలో నిమగ్నమయ్యారు. కాగా యాచారం మండలంలోని 24 గ్రామాల్లో 21 గ్రామాలు, అదేవిధంగా కందుకూరు మండలంలోని 18 గ్రామాల్లో 15 జీపీలు కందుకూరు, దాసర్లపల్లి, అన్నోజిగూడ, గూడూరు, దెబ్బడగూడ, గుమ్మడవెల్లి, కొత్తూరు, గఫూర్ నగర్, లేమూర్, మాదాపూర్, మీర్ఖాన్పేట, ముచ్చర్ల, పంజాగూడ, రాచులూరు, తిమ్మాపూర్ వంటి గ్రామాలు ఫ్యూచర్‌సిటీలో కలుస్తుండడంతో తమ ఆరు గ్రామాల పరిస్థితి, భవిష్యత్తు ఏమిటంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తమ గ్రామాలకు యాచా రం, కందుకూరు మండలాలే ఉంటాయా..? లేదా.. ఇతర మండలాల్లో విలీనం చేస్తారా..? అని చర్చించుకుంటున్నారు.
పట్టణ ప్రాంతంగా జిల్లా..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తన పరిధిని పెంచడంతో ఇక నుంచి జిల్లా మొత్తం పట్టణ ప్రాం తంగా మారనున్నది. జిల్లాలోని 16 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, 21 మండలాల్లో 13 మండలాలూ హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నా యి. కొత్తగా హెచ్ఎండీఏ తన పరిధిని విస్తృ తం చేయడంతో ఆమనగల్లు, కడ్తాల్, మా డ్గుల, తలకొండపల్లి, కొందుర్గు, కేశంపేట, చౌ దరిగూడ, పారూఖ్నగర్ మండలాలు కూడా దాని ఆధీనంలోకే వెళ్లిపోయాయి. కాగా, ఇక నుంచి జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎలాంటి అనుమతులైనా హెచ్ఎండీఏ నుంచే పొందాల్సి ఉంటుంది. ఇక నుంచి ఇండ్ల నిర్మాణంతోపాటు పరిశ్రమలు, ఇతరత్రా అన్ని నిర్మాణాలకు హెచ్ఎండీఏ నుంచే పొందాల్సిందే.