నీటి పొదుపుపై అధికారుల ప్రచారం.. ప్రభుత్వ కార్యాలయంలోనే వృథాగా పోతున్న నీళ్లు
ఓవైపు ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్నాయంటూ ప్రచారం.. మరోవైపు నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు సూచనలు.. నీటిని వృథా చేస్తే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరికలు.. ఇవన్నీ చెబుతున్న అధికారులే నీటి పొదుపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 : ఓవైపు ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్నాయంటూ ప్రచారం.. మరోవైపు నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు సూచనలు.. నీటిని వృథా చేస్తే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరికలు.. ఇవన్నీ చెబుతున్న అధికారులే నీటి పొదుపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఆవరణలోనే నీరు వృథాగా పోతుండటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాల్సిన అధికారుల కార్యాలయంలోనే నీరు వృథా అవుతుండటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు హితవు పలుకుతూ, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించే అధికారులు.. తమ కార్యాలయ పరిసరాల్లో జరుగుతున్న నీటి వృథాను ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో తలెత్తే నీటి కొరతపై ప్రచారానికే పరిమితం కాకుండా.. నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో నీటి వినియోగంపై పర్యవేక్షణ పెంచి, వృథాను అరికట్టాలని సూచిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహిస్తే నీటి పొదుపుపై చేసే ప్రచారాలకు విలువ ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో అటవీ జంతువులకు ఉచ్చు.. నలుగురిపై కేసు
Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్.. కీలకమైన అంశాలు ఇవే..!
ఈ-వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పట్టభద్రుల ఓటరు నమోదు
Harish Rao | రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికే అపాయింట్మెంట్ లేదు.. ఇదెక్కడి ప్రజాపాలన..? : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

