వికారాబాద్, ఆగస్టు 1: ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే లలితా దేవి తెలిపారు. శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ రవీంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయ ఆవరణలో నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి నీటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐడిఓసి కాంప్లెక్స్ మధ్యలో ఉన్న ఫౌంటెన్ లో టీమోపాస్ రసాయనాన్ని చల్లి లార్వా నివారణ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గార్డెన్ లోనీ పూల మొక్కలు, గడ్డి ప్రాంతాలలో దోమలు ఉండకుండా రసాయనాలను వైద్య సిబ్బంది చల్లారన్నారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో లార్వా నివారణ చర్యలు తీసుకున్నారని, ఐడిఓసి కార్యాలయంలోనీ అన్ని బాత్రూములు, హాళ్లు, క్యారీ డార్ లలో దోమల నివారణకు ఆల్ఫా సైప్రో మిత్రాన్ రసాయనాన్ని స్ప్రే చేశామన్నారు. శనివారం సాయంత్రం ఐడిఓసి కార్యాలయ ఆవరణలో దోమల నివారణకు ఫాగింగ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ డెమో వి శ్రీనివాసులు, అసిస్టెంట్ మలేరియా అధికారి సత్యం, క్షేత్రస్థాయి సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.