Vikarabad : పారిశుధ్య నిర్వహనపై శ్రద్ధ వహించాలి.. అదనపు కలెక్టర్ చంద్రయ్య

మోమిన్‌పేట : గ్రామాల్లో కలసికట్టుగా పారిశుద్ధ్యన్ని సాధించుకోవాలని జిల్లా అదనపు కటెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ కేంద్ర బృందం టీంతో గ్రామంలో పర్యటించి ప్రారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో పాటు వాడుకుంటూ బహిరంగా మల విసర్జన నిషేధించాలన్నారు. ఇంట్లో నుంచి మురికి నీరు రోడ్లుపైకి రాకుండా ఇంటింటికీ ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలన్నారు. తడి, పోడి చెత్త వేరు చేసి పంచాయతీ ట్రాక్టర్లో వేయాలని సూచించారు. పాఠశాల్లో అంగన్వాడీ, ఆరోగ్య, గ్రామ పంచాయతీ, దేవాలయలు, మసీదులు ప్రార్థన స్థలాలు, సాముహిక ప్రదేశాల్లో పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సంస్థ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహనపై పరిమాణాత్మక, గుణాత్మకమైన పరిశీలన సర్వే నిర్వహించి పారిశుధ్యంపై గ్రామాలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షన్ కేంద్ర బృందం పరిశీలకులు రఘు, ప్రసాద్, ఎంపీడీవో శైలజారెడ్డి, ఎంపీవో యాదగిరి, ఏపీవో శంకర్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

