వికారాబాద్, అక్టోబర్ 22 : కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, క్రమశిక్షణ లోపించిందని వికారాబాద్ ఎంపీపీ చంద్రకళాకమాల్రెడ్డి అన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యం లో ఎంపీపీ చంద్రకళాకమాల్రెడ్డితోపాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గత 50 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేసినట్లు వివరించారు.
కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, క్రమశిక్షణ లోపించిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనను మెచ్చే బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. దసరా పండుగ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా బీఆర్ఎస్లోకి వలసలు ఉంటాయన్నారు. అదేవిధంగా వికారాబాద్ మండలాధ్యక్షులు కమాల్‌రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు కూడా మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుష్పలతారెడ్డి, కౌన్సిలర్లు కిరణ్పటేల్, మండల వైస్ ఎంపీపీ రాములు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్ల నందు, వేణుగోపాల్ తదితరులున్నారు.