పరిగి టౌన్ : రాష్ర్ట ఉపాధ్యాయ సంఘం యొక్క పీఆర్సీ జీవోలకు సంబంధించిన హ్యాండ్ బుక్‌ను మంగళవారం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమస్యల సాధనతో పాటు సామాజిక బాధ్యతతో సమాజ కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పవన్‌కుమార్, శ్రీనివాస్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌గౌడ్, అసోసియేట్ అధ్యక్షుడు విష్ణుకుమార్, ఆర్థిక కార్యదర్శి దయాకర్, సంఘం సీనియర్ నాయకులు బసిరెడ్డి, రవీందర్‌రెడ్డి, షఫీ, బసప్ప, నరేందర్‌రాజు, ఆంజనేయులు పాల్గొన్నారు.