వికారాబాద్ : వికారాబాద్ పట్టణం బుగ్గరామలింగేశ్వరాలయ సమీపంలోని అనంతగిరి అడవిలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అటవి శాఖ అధికారులు సిబ్బంది సహాయంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెలరేగిన మంటలను సిబ్బందితో కలిసి అదుపులోకి తెచ్చారు.